మెగా 152 కోసం బాలీవుడ్ హీరోయిన్?

0

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ఒక వైపు జరుగుతూనే ఉండగా మరో వైపు 152వ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భరత్ అనే నేను తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న కొరటాల శివ చిరంజీవి తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం కోసం హీరోయిన్ ఎంపిక చర్చలు జరుపుతున్నారు.

చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం. 150 లో కాజల్ నటించగా – ప్రస్తుతం చేస్తున్న సైరాలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ముందు శ్రియ – అంజలి – అనుష్క మినహా పెద్దగా ఎవరు లేరు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు లేదంటే మళ్లీ కాజల్ ను చిరంజీవికి జోడీగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. సోషల్ మీడియాలో ఆ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించాలని భావిస్తున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ హీరోయిన్ హ్యుమ ఖురేషీ ని చిరంజీవి చిత్రం కోసం సంప్రదించడం జరిగిందని – ఆమె కూడా ఓకే చెప్పిందంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందంతో పాటు ప్రతిభ ఉండే హ్యుమ ఖురేషీ తప్పకుండా చిరంజీవి 152వ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కొరటాల భావిస్తున్నాడట.

అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం హ్యుమ ఖురేషి ఎంపిక నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఆమె రజినీకాంత్ ‘కాలా’ చిత్రంలో ఎక్కువ ఏజ్ ఆమె పాత్రలో కనిపించింది దానికి తోడు బాలీవుడ్ లో ఆమె టాప్ హీరోయిన్ కూడా కాదు. అలాంటి హ్యుమా ను చిరుకు జోడీగా ఎలా ఫిక్స్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కనుక – మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని – త్వరలోనే చిరు 152వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడవుతాయని మెగా సన్నిహితులు చెబుతున్నారు.
Please Read Disclaimer