కిచెన్ లో లవ్లీ లెగ్ పీస్

0

బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పలు చిత్రాల్లో నటించింది హుమా. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 1 & 2’.. ‘D-డే’.. ‘బద్లాపూర్’.. ‘హైవే’.. ‘జాలీ ఎల్ఎల్ బీ 2’ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ లో నటించడంతో సౌత్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ఇక ఈ భామ మిగతా బాలీవుడ్ బ్యూటీల లాగానే సోషల్ మీడియాలో దిట్ట..హాటు ఫోటోల పుట్ట.

రీసెంట్ గా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. పైనున్న ఫోటోలో ఒక రెస్టారెంట్ లోపల ఉండే కిచెన్ లో కూరగాయలు.. చికెన్ ట్రేల మధ్యలో నిలబడి తన హాట్ లెగ్ పీసును బైటపెట్టింది. ఈ ఫోటోకు హుమా ఇచ్చిన క్యాప్షన్ “ఉల్లికాడలు.. టమాటోలు.. మారినేటేడ్ చికెన్ తో చిల్ అవుట్ అవుతున్నా. మనసులో ఎప్పటికీ ఒక రెస్టారెంట్ ఓనర్ కూతురినే.” హుమా నాన్నగారు సలీమ్ ఖురేషి ఢిల్లీలో ఫేమస్ రెస్టారెంట్ల చైన్ ‘సలీమ్స్’ కు ఓనర్. అందుకే హుమా ఈ హోటల్ టచ్ ఇచ్చింది.

ఈ ఫోటోను బాలీవుడ్ బ్యూటీ కం హోస్ట్ నేహ ధూపియా లైక్ చేయడం విశేషం. సోనాక్షి సిన్హా ఈ ఫోటోకు “అన్నిట్లో కాలు పెట్టాలి.. అంతే” అంటూ కామెంట్ పెట్టింది. దీనికి సమాధానంగా హుమా “ఎప్పుడూ అంతే. నా సంగతి నీకు తెలుసుగా” అంటూ జవాబిచ్చింది. ఇక సాధారణ నెటిజన్లు కూడా సూపర్ కామెంట్లు పెట్టారు. “లవ్లీ లెగ్ పీస్”.. “మిర్చి లగీ హై”.. నువ్వు పుష్టిగా ఉండడానికి అసలు కారణం ఇదన్నమాట” అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం “తినే ఐటమ్స్ పై కాలు పెట్టావేంటి?” అన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో ఏమీ ఆఫర్లు లేవు.
Please Read Disclaimer