నాగశౌర్య పై హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు

0

యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల రకరకాల కారణాలతో హెడ్ లైన్స్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఛలో దర్శకుడు వెంకీ కుడుములతో వివాదం ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. మళ్లీ వెంకీ కుడుములకు ఛాన్స్ ఇస్తారా? అంటే “చస్తే ఇవ్వను అసలు తన కాంపౌండ్ లోకే కాలు పెట్టనివ్వను“ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దర్శకుడిగా తానే పరిచయం చేసి ఇప్పుడిలా శత్రుత్వం ఏమిటి? అన్న చర్చా సాగుతోంది. తాజాగా యంగ్ హీరో చేసిన వేరొక కామెంట్ పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.

డ్రైవర్ల పట్ల నాగశౌర్య అవమానకరంగా మాట్లాడారంటూ రాష్ట్ర ట్యాక్సీ డ్రైవర్ల ఐకాస నాయకులు హెచ్.ఆర్.సీ కి ఫిర్యాదు చేసారు. ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా నాగశౌర్య చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. దీంతో మరోసారి యంగ్ హీరో పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాగశౌర్య పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ట్యాలెంట్ ఉన్న నటుడిగా విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తపడితే హీరోగా బోలెడంత ప్యూచర్ ఉంది.

సొంతంగా ఐరా క్రియేషన్స్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నాడు. పరిశ్రమలో పెద్దల సహకారం ఉంది. అలాంటి నటుడు ఇలా వివాదాలతో మీడియాలో హైలైట్ అవ్వడం అతడి కెరీర్ కి మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే నాగశౌర్య నటించిన అశ్వథ్థామ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని వాస్తవ సంఘటలను ఆధారంగా నాగశౌర్య ఈ కథను సిద్దం చేసారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించ లేదు.
Please Read Disclaimer