మహేష్ మూవీకి లైన్ క్లియర్

0మహేష్ బాబు చకచకా సినిమాలు చేసేస్తుంటాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించేయడం.. ఇంకో మూవీకి డిస్కషన్స్ చేస్తుండడం సూపర్ స్టార్ కి అలవాటు. అందుకే.. ఓ మూవీ రిలీజ్ అయిన వారాల వ్యవధిలోనే తర్వాతి సినిమా షూటింగ్ మొదలైపోతూ ఉంటుంది.

కానీ భరత్ అనే నేను రిలీజ్ అయ్యి 50 రోజులు దాటిపోయినా ఇంకా కొత్త చిత్రం ఆరంభం కాలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు- అశ్వినీదత్ నిర్మాతలుగా మహేష్ బాబు 25వ చిత్రం అనే క్లారిటీ ఉన్నా.. ఆరంభానికి ఆలస్యం కావడం వెనుక.. నిర్మాత పీవీపీతో మహేష్ కి ఉన్న కమిట్మెంట్ అడ్డంకిగా మారింది. వంశీ పైడిపల్లితో చర్చలు జరపడం.. కథ రూపొందించడం అంతా తన బ్యానర్ కోసం జరిగిందంటూ ఆయన కేసు నమోదు చేశారు. దీంతో మూవీ షూటింగ్ ఆరంభానికే నోచుకోలేదు. ఇప్పుడు పీవీపీతో మహేష్ నిర్మాతలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం ప్రకారం పీవీపీకి రాయల్టీ లేదా నష్టపరిహారం రూపంలో 18 కోట్లను చెల్లించేందుకు అంగీకరించారట. ఈ మొత్తాన్ని తీసుకుని మహేష్ ఫిలిం నుంచి పీవీపీ పూర్తిగా తప్పుకోవడం మాత్రమే కాదు.. నమోదు చేసిన కేసులు అన్నిటినీ వెనక్కి తీసుకోబోతున్నారట. దీంతో మహేష్ కొత్త సినిమా షూటింగ్ కు అన్ని అడ్డంకులు తొలగిపోగా.. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేసినట్లు తెలుస్తోంది.