జార్జ్ రెడ్డి.. మంచి కలెక్షన్స్ అంటున్న ట్రేడ్

0

ఒక సినిమా లో స్టార్లు లేకుండా ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకర్షించడం సాధారణమైన విషయం కాదు. చాలా తక్కువ సినిమాలకే అలా జరుగుతుంది. నిన్న శుక్రవారం విడుదలైన ‘జార్జ్ రెడ్డి’ సినిమా విషయం లో సరిగ్గా ఇలానే జరిగింది. ఇంటెన్స్ ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టి ని ఆకర్షించింది ఈ చిత్రం. ఈ శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ యూత్ లో ‘జార్జ్ రెడ్డి’ సినిమా కు బజ్ మాత్రం ఎక్కువ గానే ఉంది.

రివ్యూస్.. మౌత్ టాక్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ ‘జార్జ్ రెడ్డి’ మొదటి రోజు మంచి కలెక్షన్స్ నమోదు చేసిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. జార్జ్ రెడ్డి జీవితంలోని యాక్షన్ పార్ట్ పై ఎక్కువ దృష్టి సారించి.. ఆయన మేథాశక్తి.. సామాజిక అసమానతల పై పోరాడిన జరిపిన తీరును సరిగ్గా తెరపై చూప లేదని కొన్ని విమర్శలు ఉన్నాయి. అయితే వాటితో సంబంధం లేకుండా సినిమాలోని యాక్షన్ పార్ట్ కు మంచి స్పందన దక్కుతోంది. ముఖ్యంగా కర్చీఫ్ బ్లేడ్ ఫైట్.. ఐరన్ ఫైర్ బాల్ ఫైట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ఆసక్తి పెరుగుతోంది.

సందీప్ మాధవ్ హీరోగా నటించిన ఈ సినిమా కు జీవన్ రెడ్డి దర్శకుడు. పాత్రలు కల్పితం అనే స్లైడ్ వేసినప్పటికీ ఈ సినిమా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి సంఘం నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిందనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది వేచి చూడాలి.
Please Read Disclaimer