బాలయ్య ని టార్గెట్ చేసిన ‘జబర్ధస్త్’ హైపర్ ఆది…!

0

బుల్లితెరపై వినోదాన్ని పంచడానికి ‘జబర్ధస్త్’ కామెడీ షో సిద్ధమైంది. రెండున్నర నెలలుగా షూటింగులు లేక ఆగిపోయిన షో లేటెస్టుగా షూటింగ్ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వహకులు విడుదల చేశారు. ‘జబర్ధస్త్’ ‘ఎక్స్ట్రా జబర్ధస్త్’ రెండు ప్రోమోలు రిలీజ్ చేసారు. వీటితో ఎప్పటిలానే యాంకర్స్ అనసూయ – రేష్మి ప్రోమోతో హల్ చల్ చేయడం స్టార్ట్ చేసారు. ఇక షో లో అన్ని టీమ్స్ ని పరిచయం చేసిన నిర్వాహకులు లేటెస్టుగా షకలక శంకర్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని తెలియజేసారు. ఇక కమెడియన్ తాగుబోతు రమేష్ కొత్త టీమ్ లీడర్ గా ‘జబర్ధస్త్’ కామెడీ షో అడుగు పెట్టాడు. ఈ ప్రోమోస్ లో హైపర్ ఆది టీమ్ కామెడీ ఎలా ఉండబోతుందో చూపించారు. ఆది స్కిట్స్ కామెడీకే కాదు కాంట్రవర్శీని కూడా క్రియేట్ చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. హీరోల మీద ప్రముఖ సెలబ్రిటీల మీద పంచులు పేల్చే చాలా సార్లు వారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. తనకు నచ్చిన హీరోలను పొగుడుతూ నచ్చని హీరోల మీద ఆది పంచులు వేస్తూ ఉంటాడని అందరూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ‘జబర్ధస్త్’ ఆది మీద ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు. ఆ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో ఆదికి రుచి చూపించారు.

అయితే ఆది లేటెస్టుగా వదిలిన ప్రోమోలలో మరోసారి బాలయ్య మీద పంచులు వేసాడు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ‘బీబీ 3’ టీజర్ ని ఇటీవల బాలయ్య బర్త్ డే కానుకగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..’ అంటూ బాలయ్య తనదైన శైలి లో డైలాగ్ చెప్తూ విలన్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ‘జబర్దస్త్’ షో లో హైపర్ ఆది ఈ డైలాగ్ ని కామెడీ చేసేసాడు. ”ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్లులా ఉంది అనడానికి.. ఆది గారు మా కుళ్లిపోయిన జంట ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందిరా లక్డీక పూల్” అంటూ ఆది బాలయ్య మేనరిజంతో పంచ్ వేశాడు.

ప్రోమోలోనే ఇలా ఉంటే మరి ఫుల్ స్కిట్ లో ఆది ఎలా రెచ్చి పోయాడో చూడాలి. అయితే ఇప్పుడు ఆది చెప్పిన ఈ డైలాగ్ పై ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేసారు. ఆది కి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా తన తీరు మాత్రం మార్చుకోవడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పూర్తి ఎపిసోడ్ చూసిన తర్వాత నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Please Read Disclaimer