మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సమంత

0

వరుస విజయాలతో దూకుడుమీదున్న అక్కినేని వారి కోడలు సమంత మరో ఘనత సొంతం చేసుకుంది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ టైమ్స్ 2019 సంవత్సరానికి గాను స్టార్ హీరోయిన్ అక్కినేని సమంతను ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’గా ఎంపిక చేసింది. గతేడాది మూడో స్థానం దక్కించుకున్న సమంత ఈ సంవత్సరం అగ్రస్థానానికి చేరుకుంది. వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు వయస్సున్న ప్రముఖ మహిళల గురించి సర్వే చేయగా సమంత టాప్ స్థానంలో నిలిచింది. ఈ సర్వేలో నటి సంజన విజ్ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అదితి రావు హైదరి మరియు పూజా హెగ్డేలు తర్వాతి స్థానాలలో ఉన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సమంత ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’గా ఎంపికైనందుకు తన ఆనందాన్ని తెలియజేసింది. నేను సెక్సీగా ఉంటానో లేదో తెలియదు. కానీ నేను నా భర్త చైతన్య తో డేటింగ్కు వెళ్లినప్పుడు మాత్రం చాలా సెక్సీగా ఉంటాను. ఆయన నా పక్కన ఉంటే చాలా అందంగా కనిపిస్తాను. డిజైరబుల్ ఉమెన్ గా కనిపిస్తాను. ఎల్లప్పుడు సంతోషంగా ఉండటం వల్ల మనలో అందం రెట్టింపు అవుతుందని ఇదే నా అందం వెనుక సీక్రెట్ అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా పెళ్లి తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని పెళ్లి అనేది కెరీర్ కి ఎలాంటి అడ్డంకి కాదని మరోసారి రుజువైందని అన్నారు. నా వ్యక్తిత్వం ధృడంగా ఉండటానికి కారణం నేను సమాజం నుంచి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడమేనని మనిషి శారీరకంగా దృఢంగా ఉండటంకంటే కాన్ఫిడెంటుగా ఉంటే ఈ సమాజంలో డిజైరబుల్ గా జీవించగలరని అన్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-