ప్రతిసారి పర్ఫెక్ట్ గా కనిపించ లేను.. అంటున్న బ్యూటీ

0

గోవా బ్యూటీ ఇలియానాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగులో పెద్ద స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన ఇలియానా తర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి సారించింది. ఈమధ్య బాయ్ ఫ్రెండ్ ఆండ్రూకు బ్రేకప్ చెప్పి వార్తల్లో వ్యక్తిగా కూడా మారింది. బ్రేకప్ తర్వాత వచ్చే నిరాశ నిస్పృహలకు బై బై చెప్పి పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేస్తోంది.

ఈమధ్య ఇలియానా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఇల్లీ బేబీ అందానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇల్లీ బేబీ సన్నజాజి నడుముకు ఫిదా కానీ వారు ఉండరు. అయితే ఇంత అందంగా ఉన్నప్పటికీ ఇల్లీకి తన శరీరం విషయంలో ఎప్పుడూ సంతోషంగా లేదట. తన శరీరం ఇలా బాగాలేదనే ఆలోచనలో ఉండేదట. కానీ ఇప్పుడు మాత్రం తన శరీరం ఎలా ఉంటే అలానే స్వీకరించాలనే దశకు వచ్చిందట. ఇదేదో తికమక కాన్సెప్ట్ అనుకోకండి.. మనకు పొట్ట ఉందనుకొండి. హృతిక్ ను చూసిన ప్రతిసారి మనల్ని చూసి మనకు సిగ్గేస్తుంది. అలానే పర్ఫెక్ట్ షేప్ లో ఉండే కొందరికి ఇలాంటి అనుమానాలే ఉంటాయి. ఇంకొంచెం స్లిమ్ గా ఉంటే బాగుండేదని.. ఇంకొంచెం పొడవు ఉంటే బాగుండేదని.. బుగ్గకు ఒక డింపుల్ ఉంటే బాగుండేదని.. జుట్టు సాఫ్ట్ గా ఉంటే బాగుండేదని ఏదో ఒకటి ఆలోచిస్తూ తమ బాడీని రెస్పెక్ట్ చెయ్యరు. సరిగ్గా ఇలానే ఇల్లీ గతం లో ఆలోచించేదట. కానీ ఇప్పుడు మాత్రం తన శరీరం ఎలా ఉందో అలానే బాగుందనే నిర్ణయానికి వచ్చిందట. అలా అని శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేస్తూ మంచి డైట్ తీసుకుంటూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోందట.

అసలు ఎక్సర్ సైజ్ కంటే మనం తీసుకునే ఆహారమే ఎక్కువగా శరీరం పై ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చింది. అందుకే చక్కర తక్కువగా ఉండే పదార్థాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తోందట. ఇదిలా ఉంటే తను కూడా ఒక సాధారణమైన మనిషినని.. సినిమాల్లో అందంగా కనిపించినప్పటికీ బయట కొన్ని సందర్భాలలో నార్మల్ గా కనిపిస్తానని.. ప్రతి సారి పర్ఫెక్ట్ గా కనిపించలేననే వాస్తవాన్ని తాను గ్రహించినట్టు.. అందుకే దాని గురించి పట్టించుకోవడం మానేసినట్టు తెలిపింది. ఇల్లీ బేబీ మాటల్లో నిజంగా లాజిక్ ఉంది కదా?
Please Read Disclaimer