డైరెక్షన్ చేస్తా.. స్టోరీ లైన్స్ రెడీ!- అనుపమ

0

దర్శకత్వం చేయాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఇటీవల నవతరం కథానాయికలు దర్శకత్వంపైనా మోజు పడుతున్నారు. ఎంతో ఆసక్తిగా కెమెరా వెనక కూడా వర్క్ చేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లుగా రైటర్లుగానూ అనుభవం ఘడిస్తున్నారు. ఆ కోవకే చెందుతుంది అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడికి దర్శకురాలవ్వాలన్న కల ఇప్పటిది కాదు. కెరీర్ ఆరంభమే తెరవెనక డిపార్ట్ మెంట్ పై ఆసక్తిగా ఉన్నానని చెప్పేసింది. అయితే కథానాయికగా సాగినంత కాలం అటువైపు వెళ్లనని చెప్పింది.

తాజాగా మరోసారి హైదరాబాద్ లో జరిగిన `రాక్షసుడు` ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కెప్టెన్ సీటుపై తన ఆసక్తిని తెలిపింది. భవిష్యత్తులో మిమ్మల్ని డైరెక్టర్ గా చూడొచ్చా? అని ప్రశ్నిస్తే.. తప్పకుండా చేస్తానని అనుపమ తెలిపింది. కొన్ని స్టోరీలైన్స్ కూడా ఉన్నాయి కానీ.. ఇప్పటికైతే నటనపైనే నా దృష్టి అంతా అని అంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా అనుభవం గురించి మాట్లాడుతూ… సహాయ దర్శకురాలిగా ఓ మలయాళ చిత్రానికి పని చేశానని తెలిపింది. అసిస్టెంట్ గా పని చేస్తోన్నప్పుడు చాలా ప్రొఫెషనల్ గా ఆ పనికే అంకితమయ్యాను. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఇష్టంగా చేశాను. దర్శకత్వ శాఖ అంటే ఫ్యాషన్. అందుకే అసిస్టెంట్ గా పని చేశానని అనుపమ వెల్లడించారు.

రాక్షసన్ రీమేక్ గా తెరకెక్కుతున్న `రాక్షసుడు` లో అమలాపాల్ పోషించిన పాత్రలో నటించినా తనలా నటించేందుకు ప్రయత్నించలేదని అనుపమ తెలిపింది. ఈ చిత్రంలో టీచర్ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నానని వెల్లడించింది. తెలుగు- మలయాళం సౌకర్యమైన భాషలు. ఈ రెండు రంగాల్లో నటించడం ఇష్టమని అనుపమ తెలిపింది. తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ.. `నిన్ను కోరి` తమిళ్ రీమేక్ చేస్తున్నాను. అలాగే తెలుగులో కూడా రెండు కథలు ఫైనల్ చేయాల్సి ఉందని వెల్లడించింది క్యూట్ అనుపమ.
Please Read Disclaimer