నాకు బీసీ ఆడియన్స్ ఉండరు..కానీ

0

ఈ మధ్య హీరోలకు మొదటి రోజే వారి సినిమా కొస్తున్న టాక్ ఏంటో తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న విషయాన్ని మళ్లీ వేదికలపై చెప్పేసుకోవడం కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే శర్వా కూడా మొదటి రోజు ‘రణరంగం’కి వచ్చిన డివైడ్ టాక్ గురించి దైర్యంగా చెప్పేసాడు. లేటెస్ట్ గా ‘రణరంగం’ సక్సెస్ ప్రెస్ మీట్ లో అసలు సినిమా టాక్ ఎక్కడ మొదలై ఎక్కడికి చేరుకుందో తెలియజేశాడు.

నిన్న సినిమా చూసిన వాళ్ళు సినిమాలో కథ సరిగ్గా లేదని ఇంకేదైన ఉంటే బాగుండేదని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. కానీ నేను సుధీర్ ఇద్దరం కలిసి ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ ప్రాపర్ స్టైలిష్ యాక్షన్ ఫిలిం చేద్దామనుకున్నాం. అదే చేసాం. అందులో మేము సక్సెస్ అయ్యాం. వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఫిలిం అని చూసినోళ్లు చెప్తున్నారు. అంతకంటే ఏం కావాలి అదే మాకు బెస్ట్ కాంప్లిమెంట్ అన్నాడు.

మార్నింగ్ షో కి డివైడెడ్ టాక్ . మ్యాట్నీ కి పరవాలేదు అన్నారు. ఫస్ట్ కి యావరేజ్ అన్నారు. సెకండ్ షో కి అబోవ్ యావరేజ్ అన్నారు. అలా టాక్ పెరుగుతూ వచ్చిందని చెప్పిన శర్వా కాజల్ చిన్న రోల్ అయినా ఒప్పుకొని చేసిందని తనకి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాడు. సినిమాలో తన సీన్స్ ఉంకా ఉండేవి కానీ లెంగ్త్ వల్ల ట్రిమ్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇదే వేదికపై తన సినిమాకు బీసీ ఆడియన్స్ ఉండరని అయితే ఈ సినిమాతో వాళ్లకు కూడా చేరువయ్యానని చెప్పుకున్నాడు శర్వా.
Please Read Disclaimer