సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఆ బూతు డైలాగంటే ఇష్టం, డిలీట్ చేయొద్దు: హీరోయిన్ ఏడుపు

0

చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నందు. ఇప్పుడు ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా ‘సవారి’. సాహిత్ మోత్కూరి సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రియాంక శర్మ కథానాయికగా నటించారు. అయితే ఈ సినిమాలో ఓ బూతు పదం వాడుతూ ప్రియాంక చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ డైలాగ్ చెప్పింది.

‘ఓ గాడ్. ఐ డోన్ట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్’ అనేది డైలాగ్. అయితే ఈ సినిమాకు ఇంకా సెన్సా్ర్ సర్టిఫికేట్ రాలేదు. ఒకవేళ సినిమా సెన్సార్‌కు వెళ్తే డైలాగ్‌లోని ‘ఫక్’ అనే పదం తీసేస్తారేమోనని ప్రియాంక భయపడుతున్నారు. ‘‘ఈ సినిమాలో ఇదే నా ఫేవరేట్ డైలాగ్. దేవుడా దయచేసి ఈ డైలాగ్‌ను సెన్సార్ బోర్డు వాళ్లు తీసేయకుండా చూడు’ అని వేడుకుంటున్నారు. ఈ సినిమా మొత్తం నందు, గుర్రం చుట్టూ తిరుగుతుందట. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
టీజర్, ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. పాటలు, టీజర్, ట్రైలర్‌తో కలిపి దాదాపు అరగంట నిడివి ఉన్న సినిమా చూపించామని మిగతా రెండు గంటల సినిమాను కూడా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నందు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ గురించి నందు భార్య, గాయని గీతామాధురి సోషల్ మీడియాలో స్పందించారు. ట్రైలర్‌లో భర్తను డ్రాయర్‌లో చూసి ఆశ్చర్యపోయారు. ట్రైలర్ చూస్తూ నోరెళ్లబెట్టారు. ‘‘లాస్ట్ లో నేను ఎందుకు అంత షాక్ అయ్యానో తెలియాలి అంటే పక్కాగా ఈ లింక్‌ను క్లిక్ చేయాలి. వామ్మో’’ అని ట్రైలర్ లింక్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Please Read Disclaimer