ఆ సెన్షేషన్ గల్లీ పోరడు బన్నీకి వీరాభిమానట

0

బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన ‘గల్లీ బాయ్’ చిత్రం సెన్షేషన్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో వసూళ్లను కూడా రాబట్టింది. గల్లీ బాయ్ చిత్రంలో హీరోగా రణ్ వీర్ సింగ్ నటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రంను అన్ని భాషల్లో కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది టాప్ చిత్రాల జాబితాలో గల్లీ బాయ్ ఉంటుందని అంతా అంటున్నారు. అంతటి సెన్షేషన్ విజయాన్ని సొంతం చేసుకున్న గల్లీ బాయ్ లో కీలక పాత్ర పోషించిన నటుడు సిద్దాంత్ చతుర్వేది. ఈయనకు ఈ చిత్రంతో మంచి గుర్తింపు దక్కింది.

బాలీవుడ్ లో ప్రస్తుతం ఈయనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా హీరోగా కూడా సిద్దాంత్ కు ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సిద్దాంత్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్బంగా సిద్దాంత్ తనకు అల్లు అర్జున్ అంటే అభిమానం గురించి చిన్న పిల్లాడి మాదిరిగా చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు.

తాను కాలేజ్ డేస్ లో ఉన్న సమయంలో అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమాను చూశాను అప్పటి నుండి కూడా ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆయన డాన్స్ మూమెంట్స్ ను అమితంగా ఇష్టపడతాను. ఆయన చేసిన ప్రతి సినిమాకు సంబంధించిన పాటలను వీడియోలను చూస్తానంటూ సిద్దాంత్ చెప్పుకొచ్చాడు. ఆయన ఎనర్జి మరియు స్టైల్ నాకు ఇష్టం అన్నాడు. మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారిని కలవాలని కోరుకుంటున్నాను అంటూ మీడియా ముఖంగా అల్లు అర్జున్ కు సార్ ఒక్కసారి మిమ్ముల్ని కలవాలి అంటూ రిక్వెస్ట్ చేశాడు.

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా సంచలనం ప్రియా వారియర్ కూడా తాను అల్లు అర్జున్ ఫ్యాన్ అంటూ ప్రకటించింది. తాజాగా సిద్దాంత్ కూడా తాను అల్లు అర్జున్ కు వీరాభిమానిని అంటూ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer