ఇంతకీ ఎవరి పాపాల్ని బయట పెడుతోంది?

0

చిత్ర పరిశ్రమలో ఎన్నో విచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. సినీనేపథ్యం లేకపోతే ఆ కష్టాలు మరింత ఎక్కువ. కేవలం ప్రతిభతోనే ఇక్కడ ఈదే వాళ్లు చాలా తక్కువమంది. అయితే అలాంటి అరుదైన ప్రతిభావనిగా తాప్సీ పేరు మార్మోగిపోతోంది. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న తాప్సీకి ఇండస్ట్రీలో గతంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాను దక్షిణాదిన డజను పైగా సినిమాల్లో నటించాక కూడా బాలీవుడ్ లో ఇబ్బందులు ఎదుర్కొందట. అక్కడ కెరీర్ ఆరంభం ఏవైనా వేడుకలు జరిగేప్పుడు ఆరో లైన్ లో కూచున్న సందర్భాలున్నాయి. అంతగా ప్రధాన్యత లేని నాయికగా మిగిలిపోవడం కలతకు గురి చేసిందట. సౌత్ అనుభవం అక్కడ తనకు ఏ రకంగానూ కలిసి రాలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇకపోతే సినీనేపథ్యం లేకపోవడం అనేది తనకు బాలీవుడ్ లో కొన్నిసార్లు కెరీర్ పరంగా చాలానే ఇబ్బంది పెట్టిందని తాప్సీ తెలిపింది. కేవలం ఆ కారణం వల్లనే అవకాశాల్ని కోల్పోయిన సందర్భాల్ని గుర్తు చేసుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ స్థానానికి ఎదిగాక ఇవన్నీ బయటపెడుతూ వేడి పెంచుతోంది. మరోవైపు యారొగెంట్ సిస్టర్స్ క్వీన్ కంగన-రంగోలితోనూ తాప్సీ బిగ్ ఫైట్ గురించి తెలిసిందే. ఈ విషయంలో ఒక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నా బాలీవుడ్ లో మెజారిటీ వర్గం తాప్సీ వైపే మొగ్గు చూపిస్తోంది. కంగన వ్యతిరేకులంతా తాప్సీ కి అనుకూలురుగా మారారు. మొత్తానికి ఇప్పటికి తాప్సీకి అన్నిరకాలుగా కలిసొస్తుందనే చెప్పాలి. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లాక సీన్ మారింది. సౌత్ లో తనకు ఏ విధంగానూ లక్ కలిసి రాలేదు. కానీ బాలీవుడ్ కి వెళ్లాక అక్కడ తనకంటూ ఓ మార్క్ ఉందని ప్రూవ్ చేసుకోగలిగింది.

ఇకపోతే తనకు అన్యాయం జరిగినా ఎప్పుడూ ఫలానా వ్యక్తి వల్ల అలా జరిగిందని పేర్లు బయట పెట్టలేదట. కేవలం పాపాల్ని మాత్రమే బయటపెట్టాను తప్ప పాపుల్ని కాదు! అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా సెటైర్లు వేసింది. మొత్తానికి సినీ ప్రపంచంలో ఎదురీదిన అనుభవంతో తాప్సీ మాట తీరులోనూ రాటు దేలినట్టే కనిపిస్తోంది. తాప్సీ నటించిన భారీ మల్టీస్టారర్ `మిషన్ మంగళ్` ఇటీవలే రిలీజై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత తాపడ్ అనే మరో భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోంది.
Please Read Disclaimer