ఐమిస్ యూ అంటూ నితిన్ ఎమోషనల్ : వైరల్ వీడియో

0

‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఒక ఇంట్లో చేస్తున్నారు. అదే ఇంట్లో గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఆ’ చిత్రాన్ని కూడా చిత్రీకరించారు. ఆ సినిమాలో కూడా హీరో నితిన్ అనే విషయం తెల్సిందే. ఆ ఇంట్లో ‘భీష్మ’ షూటింగ్ సందర్బంగా నితిన్ సరదాగా ఎమోషనల్ అయ్యాడు.

ఈ ఇల్లు నాకు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. అఆ మూవీ జర్నీ అద్బుతంగా సాగింది. ఇక్కడ త్రివిక్రమ్ గారిని మిస్ అవుతున్నాను అంటూ జోక్ గా నితిన్ ఏడుస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడే అదే ఇంట్లో భీష్మ షూటింగ్ జరుగుతున్నట్లుగా కూడా నితిన్ పేర్కొన్నాడు. అఆ చిత్రంలోని మెజార్టీ పార్ట్ ఆ ఇంట్లోనే షూట్ చేశారు. సమంత మరియు నితిన్ ల కాంబోలో ఆ ఇంట్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు సెంటిమెంట్ తో నితిన్ మళ్లీ అదే ఇంట్లో భీష్మను చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

నితిన్ కెరీర్ లో నిలిచి పోయే సినిమాగా ‘అఆ’ నిలిచింది. అందుకే నితిన్ కు ఆ ఇళ్లంటే.. దర్శకుడు త్రివిక్రమ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇక భీష్మ విషయానికి వస్తే సినిమా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఛలో చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రంతో మరో కమర్షియల్ సక్సెస్ పై కన్నేశాడు.
Please Read Disclaimer