ఆ ఇద్దరి వల్ల నేను బ్యాడ్ అయ్యా

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నుండి మొదటి వారంలోనే హేమ ఎలిమినేట్ అయ్యింది. బలమైన కంటెస్టెంట్ అనుకున్న హేమకు ఓట్లు తక్కువ పడటంతో పాటు ఇంటి సభ్యులు ఆమె ప్రవర్తన సరిగా లేదు అంటూ జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఆమె మొదటి ఎలిమినేషన్ లోనే బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ అయిన తర్వాత మొదట మాటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన హేమ ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆమె తన బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకుంది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… నేను ఇంటి సభ్యుల బాగోగులు చూసుకుంటే అది వారికి నచ్చలేదు. కిచెన్ కు సంబంధించిన వస్తువులు వారం అంతా వచ్చేలా నేను ప్లాన్ చేయాలనుకున్నారు. కాని వారు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నేనేదో డామినేట్ చేస్తున్నట్లుగా అనుకున్నారు. వరుణ్ సందేశ్ ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాడు. అతడికి ఏదో ఒకటి కావాలి అంటూ వితిక కిచెన్ కు వస్తూ ఉండేది. అప్పుడు నేను ఆమెకు మెల్లగా చెప్పేందుకు ప్రయత్నించాను. దాంతో తను నన్ను తప్పుగా అర్థం చేసుకుంది.

వితికతో పాటు శ్రీముఖి కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. వారివల్లే నేను బ్యాడ్ అయ్యాను. బిగ్ బాస్ హౌస్ లో జరిగేది మొత్తం చూపించడం లేదు. ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండే కంటెంట్ మాత్రమే చూపుతున్నారు. హేమ గొడవకు అందరు ఆసక్తి చూపినట్లుగా ఉన్నారు. అందుకే మా టీవీ వారు దాన్నే ఎక్కువగా చూపించారు. మహేష్ పైకి వరుణ్ కొట్టేందుకు వెళ్లాడు. దాన్ని మాత్రం పెద్దగా చూపించలేదు. నేను ఒక పెద్ద తరహాగా ఆలోచించడం కారణంగానే ఎలిమినేట్ అయ్యానని హేమ అభిప్రాయం వ్యక్తం చేసింది.
Please Read Disclaimer