మెగాస్టార్ స్క్రిప్ట్.. 5 రోజులు అంటున్న పూరి

0

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్టర్ గా ఫామ్ లోకి వచ్చాడా లేదా అనేదానికి పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉండొచ్చు కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ తో సూపర్ హిట్ సాధించాడు అనేది నిర్వివాదాంశం. గత కొన్నేళ్ళుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్న పూరికి ‘ఇస్మార్ట్ శంకర్’ పెద్ద బూస్ట్ ఇచ్చింది. దీంతో పూరి ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పూరి తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలని ఉందనే ఆకాంక్షను వెలిబుచ్చారు. నాలుగైదు సందర్భాలలో చిరును డైరెక్ట్ చేసే అవకాశాన్ని తాను మిస్ అయినట్టు వెల్లడించిన పూరి ఇప్పటికీ మెగాస్టార్ సినిమాకు నేను రెడీ అనే సంకేతాలు ఇవ్వడం గమనార్హం. “ఇప్పడైనా చిరంజీవి గారు నన్ను పిలిస్తే ఐదు రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేసి డైరెక్ట్ చేసేందుకు రెడీ గా ఉంటాను” అంటూ తన స్టైల్ లో చెప్పుకొచ్చారు.

అయితే స్క్రిప్ట్ ను ఐదు రోజుల్లో పూర్తి చేసినా.. ఐదు నెలల సమయం తీసుకున్నా కంటెంట్ ముఖ్యం. స్క్రిప్ట్ లో సత్తా ఉంటే మాత్రం పూరిని మెగాస్టార్ పూరిని రిజెక్ట్ చేసే అవకాశం ఉండదు. పూరి గతంలో చిరు కోసం ‘ఆటో జానీ’ స్క్రిప్ట్ ను రెడీ చేసిన సంగతి తెలిసిందే. చిరుకు సెకండ్ హాఫ్ సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు పూరి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు కాబట్టి మళ్ళీ చిరును డైరెక్ట్ చేసే అవకాశాలు మెరుగైనట్టే.
Please Read Disclaimer