ఆమె మాటలు పూర్తిగా వక్రీకరించారట

0

మల్టీ ట్యాలెంట్ అమ్మాయిగా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ చాలా బోల్డ్ గా కూడా ఉంటుంది. ఆమె ఫారిన్ కల్చర్ ను ఎక్కువగా అనుసరిస్తున్నట్లుగా అనిపిస్తు ఉంటుంది. చాలా మంది అలాగే ఉన్నా కూడా మీడియా ముందుకు వచ్చేప్పటికి కాస్త పద్దతిగా ఉన్నట్లుగా నటిస్తారు. కాని శృతి హాసన్ మాత్రం తాను ఎలా ఉంటుందో అలాగే మీడియాలో కూడా కనిపిస్తుంది. ఆమె మాట్లాడే తీరు కూడా చాలా బోల్డ్ గా ఉండటంతో పాటు నిజాలు మాట్లాడుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ గతంలో తాను ఆల్కహాల్ తీసుకునేదాన్ని కాని ఇప్పుడు తీసుకోవడం లేదు. ప్రస్తుతం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

శృతిహాసన్ చేసిన ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా వక్రీకరించారు. ఎవరికి తోచిన విధంగా వారు రాసేసుకున్నారు. శృతి హాసన్ ఒకప్పుడు బాగా తాగేదట.. ఆమె ఒక ఆల్కహాలిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఇండియన్ అమ్మాయి అయ్యి ఉండి ఆల్కహాల్ తాగేదాన్ని అంటూ చెప్పడానికి బుద్ది లేదా అంటూ ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. తనపై వస్తున్న ట్రోల్స్ కు శృతి సమాదానం చెప్పేందుకు ప్రయత్నించింది.

శృతి హాసన్ తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ… ఆ టాక్ షో లో నేను ప్రస్తుతం నేను ఆల్కహాల్ తీసుకోవడం లేదని.. ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా చెప్పాను. ఆ విషయాలను చాలా మంది చాలా రకాలుగా మార్చేయడం జరిగింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నా వ్యాఖ్యలను వక్రీకరించారు. నా వ్యాఖ్యలు వారికి అర్థం కాలేదనిపిస్తుంది. ఈ రోజుల్లో డ్రింకింగ్ అనేది చాలా కామన్ విషయం. డ్రింకింగ్ అనేది ప్రతిష్టను దెబ్బ తీసేది ఏమీ కాదు. డ్రింక్ చేసే వాళ్ల గురించి నేనేం మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరు తాగినా ఎవరు ఆ విషయం గురించి మాట్లాడరు. కొందరైతే తాము తాగుతామనే విషయాన్ని కూడా ఒప్పుకోరు.

2019వ సంవత్సరంలో ఉండి కూడా మనం ఇంకా మద్యం విషయంలో రహస్యాన్ని పాటించడం అనేది హాస్యాస్పదం అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. నేను ఆల్కహాల్ గురించి చేసిన వ్యాఖ్యలను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మార్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా గురించి మరెవ్వరు కూడా అసభ్యకర వ్యాక్యలు చేయవద్దని హెచ్చరించింది. ప్రస్తుతం ఈమె తమిళం మరియు హిందీల్లో నటిస్తోంది. నటించడం కంటే సంగీతం కచేరీలు ఇవ్వడం తనకు చాలా ఇష్టమంటున్న శృతి హాసన్ వచ్చే డిసెంబర్ లో ఇంగ్లాండ్ కు వెళ్లి అక్కడ ప్రదర్శనలు ఇవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer