నాకేం బాధ లేదు.. మీరు బాధపడకండి

0

తీన్మార్ వార్తలతో సావిత్రిగా మంచి ఫేమ్ ను దక్కించుకున్న శివజ్యోతి బిగ్ బాస్ 3 లో ఏకంగా 14 వారాలు కొనసాగింది. టాఫ్ 5లో ఉండాలని చాలా ప్రయత్నించింది. మొన్న ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే తనకంటే ముందు ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులతో ఒక పబ్ లో పార్టీ చేసుకోవడంతో పాటు శివ జ్యోతి దీపావళి పండుగను కూడా జరుపుకుంది. పండుగ తర్వాత రోజు తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో తనను ఇంత దూరం తీసుకు వచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది. విన్నర్ కాలేక పోయాను అనే బాధ నాకేం లేదు. నాకు ఇంత కాలం సపోర్ట్ చేసిన మీరు కూడా బాధ పడకండి. విన్నర్ ఒక్కరే ఉంటారు కదా. నా జర్నీ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను. మీ ఈ అభిమానంను ముందు ముందు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను అంటూ శివజ్యోతి కోరింది.

బిగ్ బాస్ 3లో శివజ్యోతి మొదటి కంటెస్టెంట్ గా వెళ్లింది. మొదట ఎవరితో గొడవ పడకుండా చిన్న విషయానికి కూడా బాగా ఎమోషన్ అయ్యి ఏడుస్తూ ఉండేది. ఈమె ఏడుపుకు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో మీమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాతాల గంగా అనే పేరును ఈమె సోషల్ మీడియా ద్వారా పొందింది.

సీజన్ సగం పూర్తి అయ్యే వరకు శివ జ్యోతి ఒక సాదారణ కంటెస్టెంట్ గా కనిపించినా ఆ తర్వాత ఆమె ఇతరులతో గొడవ పడటం టైటిల్ కోసం గట్టిగా పోరాటం చేసింది. ఫైనల్ వరకు వెళ్లాలని ఆమె చాలా గట్టిగానే పోరాడింది. కాని వితిక విషయంలో ఆమె చేసిన పొరపాటు లేక మరేంటో కాని శివ జ్యోతి టాప్ 5 లో చోటు దక్కించుకోలేక పోయింది.
Please Read Disclaimer