రజినీతో ఛాన్స్ ఇచ్చి గోపీచంద్ రుణం తీర్చుకుంటున్న శివ

0

ప్రస్తుతం తమిళనాట దర్శకుడు శివ టాప్ డైరెక్టర్ గా వెలుగు వెలుగుతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలకు ఈయన మోస్ట్ వాంటెడ్ దర్శకుడు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నయనతార.. ఖుష్బు.. కీర్తి సురేష్.. మీనా వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా లో కీలక పాత్రకు గాను గోపీచంద్ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

హీరోగా పరిచయం అయిన గోపీచంద్ మొదట్లో సక్సెస్ రాక పోవడంతో విలన్ గా మారాడు. విలన్ గా మూడు సక్సెస్ లు దక్కిన తర్వాత మళ్లీ హీరోగా మారి వరుసగా హీరోగా చిత్రాలు చేశాడు. మళ్లీ ఈమద్య కాలంలో వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. ఈ సమయంలోనే గోపీచంద్ మళ్లీ విలన్ వేషాలు వేయాలనుకుంటున్నాడట. అందుకే రజినీకాంత్ మూవీ కోసం దర్శకుడు శివ ఈయన్ను తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

దర్శకుడు శివ కెరీర్ ఆరంభంలో గోపీచంద్ తో శౌర్యం.. శంఖం చిత్రాలు చేశాడు. ఆ సినిమాలు శివకు మంచి బూస్ట్ ఇచ్చాయి. అందుకే గోపీచంద్ ను శివ మర్చి పోలేదని చెప్పుకోవచ్చు. అందుకే రజినీకాంత్ మూవీలో గోపీచంద్ కు ఛాన్స్ ఇచ్చి ఉంటాడు అంటున్నారు. గోపీచంద్ విలన్ గా ఈ సినిమాలో కనిపించి కమర్షియల్ హిట్ ను అందుకుంటే ఖచ్చితంగా ముందు ముందు మరిన్ని సక్సెస్ లు దక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-