ఇద్దరి లోకం ఒకటే ఫస్ట్ లుక్

0

ఒకప్పుడు వరుస హిట్లతో స్టార్ రేస్ కి వెళ్లాడనుకున్న రాజ్ తరుణ్ తర్వాత ఒకదానివెంట మరొకటి ప్లాప్ లతో తన కెరీర్ ని అయోమయంలో పడేసుకున్నాడు. అతనికి 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ తర్వాత హిట్ అనేది లేదు. ఇప్పుడు ఎలా అయినా హిట్ కొట్టాలని కసితో ఉన్న రాజ్ తరుణ్ జీ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సినిమా యూనిట్ శరవేగంగా మిగిలిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేస్తుంది.

దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు రాజ్ తరుణ్ కెరీర్ నిలబడాలంటే అతనికి సక్సెస్ అర్జెంటు గా కావాలి. ఇప్పటికే హిట్స్ లేక బయట ఆక్సిడెంట్ కేసులతో తలమునకలౌతున్న రాజ్ తరుణ్ కి వరుస హిట్ సినిమాలు తీస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న దిల్ రాజు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి అందిస్తున్నారు. సంగీతం మిక్కీ జే మేయర్ సమకూరుస్తున్నారు.