‘భజన బ్యాచ్’ నవ్వుల పండగ మొదలైంది.!

0

మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు ధీటుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ వృద్ధి చెందుతోంది. రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోన్న ఈ డిజిటల్ మీడియా విభాగంలో ‘ఐ డ్రీమ్’ సంచలనాత్మక వేగంతో దూసుకుపోతోంది. కంటెంట్ క్రియేషన్‌లో ఐ డ్రీమ్ మీడియా చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ.. వీక్షకులకు సరికొత్త మజా అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై సత్తా చాటిన ఐ డ్రీమ్ మీడియా మరో సంచలనానికి సిద్ధమైంది.

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో రూపొందిన ‘భజన బ్యాచ్’ సోనీ లైవ్ ద్వారా నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ‘బస్టాప్’ భలే భలే మగాడివోయ్’ ప్రేమకథా చిత్రమ్’ వంటి సినిమాలు నిర్మించిన ప్రముఖ దర్శకుడు మారుతి ఈ ‘భజన బ్యాచ్’కి కాన్సెప్ట్ అందించారు. ‘అక్షర’- ‘వీడు తేడా’- ‘లండన్ బాబులు’- ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ తదితర చిత్రాల్ని రూపొందించిన దర్శకుడు చిన్నికృష్ణ ఈ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తున్నాడు.

గెటప్ శీను – జెమినీ సురేష్ – అజయ్ ఘోష్ – జోగి కృష్ణంరాజు – జబర్దస్త్ వేణు – రాఘవ – షకలక శంకర్ తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. పోసాని కామెడి టైమింగ్ మిగతా కామెడీ బ్యాచ్ పండించిన నవ్వులు వెరసి ‘భజన బ్యాచ్’ బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది.

ఐ డ్రీమ్ మీడియా – లైవ్ టీవీ – క్యాచ్ అప్ టీవీ – అన్లిమిటెడ్ మూవీస్ తదితర విభాగాల్లో తనదైన ప్రత్యేకతను సంతరించుకుంది. విదేశాల్లో ఉన్న తెలుగు వారిని మంత్ర ముగ్థుల్ని చేసేందుకు యుప్ టీవీ ‘భజన బ్యాచ్’ని ఓవర్సీస్లో స్ట్రీమ్ చేస్తోంది.

ఐ డ్రీమ్ మీడియా నుండి ‘ముద్దుగారే యశోదా..’ తర్వాత వస్తున్న ఈ ‘భజన బ్యాచ్’ మరింతగా వీక్షకుల ఆదరణ పొందుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ‘ముద్దుగారే యశోదా..’ సంప్రదాయం మేళవించిన మోడ్రన్ వ్యూస్ ఆఫ్ లైఫ్ నేపథ్యంలో సాగుతుంది. పవిత్రా లోకేష్ – సమీర్ – శృతి సింగం పల్లి – అప్పాజీ అంబరేష్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం.

ఒరిజినల్ కంటెంట్ విషయంలో ఐ డ్రీమ్ మీడియా తనదైన ముద్ర వేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మరింతగా తన ప్రత్యేకతను చాటుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త పంథాని ఎంచుకుంటోంది.

ఇంటర్వ్యూలు తదితర ఒరిజినల్ కంటెంట్‌తో తెలుగు వీక్షకులకు అత్యంత చేరువైన ఐ డ్రీమ్ మీడియా నుంచి ఇది మూడో వెబ్ సిరీస్..

– ‘డార్లింగ్ మహాలక్ష్మి’ పేరుతో రూపొందించిన వెబ్ సిరీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. విఐయూ ప్లాట్‌ఫామ్‌పై ఇది వీక్షకుల ముందుకొచ్చింది

– ‘ముద్దుగారే యశోద’ సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. సోనీ లివ్ ద్వరా ప్రేక్షకులకు చేరువైంది ఈ వెబ్ సిరీస్.

– ‘భజన బ్యాచ్’ మొదటి రెండు వెబ్ సిరీస్ ల తరహాలోనే మూడోది కూడా మంచి విజయాన్ని అందుకోనుంది.

For More Details Visit iDream Media: https://www.iDreamMedia.com

More Web Series on iDream Media: https://www.idreammedia.com/original-content/webseries

Bhajana Batch Series on SonyLIV: https://www.sonyliv.com/details/show/6074991457001/Bhajana-Batch

iDream Media on Amazon Prime: https://www.idreammedia.com/movies/amazon-prime

Press release by: Indian Clicks LLC
Please Read Disclaimer