స్టార్ హీరోలను అంటుకున్న కరోనా..

0

రోజురోజుకు కరోనా వైరస్ ఎవ్వరిని వదలకుండా అతివేగంగా ప్రబలుతోంది. ఏ దేశం చూసినా కరోనా అంటూ భయపడుతున్నారు. ఈ కరోనా భయం సామాన్య ప్రజలనే కాదు స్టార్ సెలెబ్రిటీలను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా సినిమా స్టార్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటారు వాళ్లకు సామాన్యంగా ఇలాంటి వైరస్ లు సోకవులకే అని అందరు అనుకుంటారు. కానీ అది అబద్ధం. సెలెబ్రెటీలు బయటికి రాకపోవచ్చు కానీ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండలేరని చెప్పలేం కదా..!

ఈ కరోనా వైరస్ ఇద్దరు హాలీవుడ్ సూపర్ స్టార్లకు సోకిందట. ప్రముఖ హాలీవుడ్ నటుడు ఇడ్రిస్ ఎల్బాకు కరోనా వైరస్ సోకినట్లు తానే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. తనకు నిర్వహించిన వైద్య పరీక్షలలో కరోనా పాసిటివ్ ఉందని వైరస్ కన్పించలేదు కానీ లక్షణాలు ఉన్నట్లు తేలిందని తెలిపాడు. అంతేగాక కరోనా వైరస్ రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని వీడియో రూపంలో సూచించాడు.

ఇక హాలీవుడ్ మరో స్టార్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాక్టర్ క్రిస్టోఫర్ హిజువుకు కూడా కరోనా పాసిటివ్ ఉన్నట్లు తేలింది. అందుకే తను నార్వేలోని సెల్ఫ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. ప్రజలు కరోనా వైరస్ సోకకుండా ఆరోగ్యాంగా ఉండాలని కరోనా ప్రభావం తగ్గే వరకు ఇతరులకు దూరంగా ఉంటే మంచిదని సూచించాడు. మరి ఈ కరోనా ఇంకెంత మందిని పీడించి చంపుతుందోనని అభిమానులు సెలెబ్రిటీలు వాపోతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-