మోకాళ్లపై ప్రపోజ్ చేయకపోతే పెళ్లాడేదాన్ని కాదు!-కాజల్

0

బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని చందమామ కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండ్ నే ప్రేమించి వివాహం చేసుకోవడం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఇక తనకు ఎంతో సన్నిహితుడే అయిన కిచ్లుని పెళ్లాడిన కాజల్ ఎంతో ఎగ్జయిట్ అవుతోంది.

అంతేకాదు.. అందరు అమ్మాయిల్లానే.. తన ప్రియుడు తనకు మోకాళ్లపై నిలిచి గులాబీ అందించి ప్రేమను వ్యక్తం చేయాలని కాజల్ కోరుకుందట. తాను కోరుకున్న ప్రియుడు కోరుకున్నట్టే తనకు అలానే ప్రపోజ్ చేయడం వల్లనే పెళ్లాడేసిందట. ఒకవేళ అలా చేయకపోతే పెళ్లాడక పోయేదానినే! అంటూ కొంటెగా కామెంట్ ఒకటి రువ్వింది.

ప్రతి అమ్మాయి ఇలా కోరుకుంటుంది అని కరాఖండిగా చెప్పేసింది కాజల్. గౌతమ్ ముందే తన తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం ఖాయం చేసేసుకున్నాడని అయినా కానీ తనకు మోకాళ్లు వేసి ప్రపోజ్ చేయాలని కండీషన్ పెట్టానని కూడా కాజల్ చెప్పింది. అద్భుత ప్రేమకథ తర్వాతనే వివాహం ఎంతో మధురంగా ఉంటుందని కాజల్ అంది.

గౌతమ్ ఎంతో పరిణతి చెందిన వ్యక్తి. అతను ఆమెపై ఎటువంటి అంచనాలను కలిగి లేడు. పెళ్లి తర్వాత వారిద్దరికీ మరింత బాధ్యత పెరిగిందని అర్థమవుతోంది. తన భర్త గురించి ప్రశ్నిస్తే ఇలాంటి రకరకాల విషాయాల్ని చకచకా చెప్పేస్తోంది చందమామ. ఈ కొత్త జంట ప్రస్తుతం మాల్దీవుల్లో అండర్ వాటర్ హనీమూన్ లో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే.