నువ్వుంటే సుశాంత్ బతికేవాడేమో: నటుడు సందీప్ సింగ్ ఎమోషనల్ పోస్ట్

0

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా అందరిని కలిచి వేసింది. సోషల్ మీడియాలో సుశాంత్ అంకిత లోఖండేతో పాటు కృతి సనన్.. రియా చక్రవర్తిలతో ప్రేమాయణం నడిపాడని వార్తలు ముమ్మరం అయ్యాయి. వీరిలో అంకితతోనే ఎక్కువ కాలం ప్రేమలో ఉన్నాడు సుశాంత్. టీవీ సీరియల్ పవిత్ర రిష్తా షూటింగ్ టైంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారట. అయితే చాలాకాలం ప్రేమ తర్వాత ఇద్దరు విడిపోయారు. సుశాంత్ – అంకిత ప్రేమలో ఉన్నప్పుడు వీరికి సందీప్ సింగ్(నటుడు) అనే స్నేహితుడు ఉండేవాడట. తాజాగా సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేని సందీప్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా స్పందించాడు. ‘ప్రియమైన అంకిత ప్రతి రోజు గడిచేకొద్దీ ఒక ఆలోచన నన్ను పదే పదే వెంటాడుతూనే ఉంటుంది. మనం ఇంకా గట్టిగా ప్రయత్నించాల్సి ఉంది. మనం సుశాంత్ మరణాన్ని ఆపాల్సింది. అందుకు ఇంకా వేడుకోవాల్సింది.మీరిద్దరూ విడిపోయినప్పుడు కూడా సుశాంత్ ఆనందంగా ఉండాలని.. విజయం సాధించాలని ప్రార్థించావు. మీ ప్రేమ స్వచ్ఛమైంది. ఎంతో ఉత్తమమైనది. ఇప్పటికీ మీ ఇంటికి ఉన్న నేమ్ప్లేట్ నుంచి సుశాంత్ పేరు తొలగించలేదు. ఆ రోజులను నేను మిస్ అవుతున్నాను. మనం ముగ్గురం లోఖండ్వాలాలో కలిసి ఉన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. కలిసి వంట చేయడం.. కలిసి తినడం.. ఏసిలో నీరు తీసేయడం.. మటన్తో వండిన వంటలు.. ఉతాన్.. లోనావాలా.. గోవా లాంగ్ డ్రైవ్లు.. హోలీ పండగ.. మనం పంచుకున్న ఆ నవ్వులు.. మనమంతా ఒకరికొకరు స్నేహంగా ఉన్నప్పటి రోజులు ఇంకా గుర్తొస్తున్నాయి. ఇంకా నువ్ సుశాంత్ ముఖంలో చిరునవ్వు తెచ్చేందుకు చేసిన పనులు.. నువ్వే అందరికంటే ఎక్కువగా సుశాంత్ ని నవ్వించేదానివి. మీరిద్దరు ఒకరికోసం ఒకరు పుట్టారని ఈ రోజుకీ నాకు అనిపిస్తుంది.మీది నిజమైన ప్రేమ. ఈ ఆలోచనలు.. ఈ జ్ఞాపకాలు నన్ను నా మనసును తొలిచేస్తున్నాయి. నేను వాటిని తిరిగి ఎలా పొందగలను! నేను వాటిని తిరిగి కోరుకుంటున్నాను! నాకు మళ్లీ మన ముగ్గురం తిరిగి కావాలి అనిపిస్తుంది! మాల్పువా గుర్తుందా!? అతను చిన్న పిల్లవాడిలా మా అమ్మను మటన్ కూరను ఎలా అడిగేవాడో గుర్తుందా..? నీవు మాత్రమే అతన్ని రక్షించగలవని నాకు తెలుసు. మనం కలలుగన్నట్లు మీరిద్దరూ వివాహం చేసుకోవాలని కోరుకున్నాను. నువ్ సుశాంత్ తో ఉండేందుకు ఒప్పుకుని ఉంటే బతికేవాడేమో.. నువ్ సుశాంత్ కి ఎప్పటికి ఫ్రెండ్.. భార్య.. తల్లి.. బెస్ట్ ఫ్రెండ్. ఐ లవ్ యు అంకిత.

నీలాంటి స్నేహితురాలిని ఎప్పటికీ కోల్పోను. నేను ఈ విషయాన్ని జోర్ణించుకోలేకపోతున్నా..” అంటూ సుశాంత్ అంకితల గురించి భావోద్వేగానికి గురయ్యాడు సందీప్. ప్రస్తుతం సందీప్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Please Read Disclaimer