ఇళయరాజా మళ్లీ రచ్చ అసలేమైంది?

0

దక్షిణాదిలో వున్న గొప్ప సంగీత విధ్వాంసుడు మ్యాస్ట్రో ఇళయరాజా. దక్షిణాది పరిశ్రమతో పాటు ప్రపంచ దేశాల్లోని సినీపరిశ్రమలు లెజెండ్ అని గౌరవించే గొప్ప తపస్వి అతడు. తెలుగు- తమిళ భాషల్లో అత్యద్భుతమైన పాటల్ని అందించిన ఆయన గత కొంత కాలంగా తన పాటల ద్వారా తనకు దగ్గాల్సిన రాయాల్టీపై ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నారు. తన పాటల్ని ఎవరు వినియోగించుకున్నా.. ప్రైవేట్ వేదికలపై పాడినా దాని ద్వారా వచ్చే మొత్తంలో కొంత రాయాల్టీగా తనకు చెల్లించాలని చాలా కాలంగా పోరాడుతున్నారు. అయితే మాస్ట్రో ఇళయరాజా వాదనకు సింగర్స్.. సంగీత దర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆయన వాదనతో కొందరు ఏకీభవించడం లేదు.

ఆ మధ్య బాలుని సైతం స్టేజ్ పై తన పాటల్ని తన అనుమతి లేకుండా ఎవరూ పాడకూడదని ఇళయరాజా షరతు విధించారు. తాజాగా తన పాటలకు రాయాల్టీని ఇవ్వడం లేదని ప్రాసాద్ స్టూడియోస్ వారిపై చెన్నైలోని విరుగంబాక్కమ్ పోలీస్ స్టేషన్లోఇళయరాజా కేసు నమోదు చేయించారు. దీంతో ఇళయరాజా వివాదం మళ్లీ మొదటికొచ్చింది.

చెన్నయ్ ప్రసాద్ స్టూడియోస్ ప్రాంగణంలోనే గత కొన్ని దశాబ్దాలుగా అద్దెకు ఓ స్టూడియోని నడిపిస్తున్నారట ఇళయరాజా. అయితే ఆ స్థలాన్ని అప్పట్లో ఎల్వీ ప్రసాద్ తనకు కేటాయించారు. ఇప్పుడు దానిని ఖాళీ చేయించేందుకు.. స్టూడియోలోని ఇళయరాజాకు సంబంధించిన సంగీత పరికరాల్ని బయట పడేసి నాశనం చేస్తున్నారని ఆయన మేనేజర్ గఫ్ఫార్ ఆవేదన వ్యక్తం చేయడం సంచలనమైంది. మ్యూజిక్ మ్యాస్ట్రోకే అవమానమా? అంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు. మొత్తానికి రాయల్టీ రచ్చ రాజాకు చాలానే చిక్కులు తెచ్చిపెడుతోందన్న ముచ్చటా సాగుతోంది.
Please Read Disclaimer