ఇల్లీ బేబి లవ్ బ్రేకప్ వెనక కఠోర సత్యం

0

గోవా బ్యూటీ ఇలియానా లవ్ బ్రేకప్ ఆల్వేస్ హాట్ టాపిక్. విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం సాగించి సహజీవనం చేసి.. అటుపై బ్రేకప్ చెప్పేసిన సంగతిని ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇలా అకస్మాత్తుగా బ్రేకప్ అవ్వడానికి కారణమేంటి? అన్నది మాత్రం
ఇలియానా ఫ్యాన్స్ ఎంతగా వేచి చూసినా ఇంతవరకూ చెప్పలేదు.

తాజాగా `పాగల్ పాంటీ` సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయంపై మాట్లాడిన ఇలియానా చెప్పిన ఆ నిజం షాక్ కి గురి చేస్తోంది. “నేను ఎప్పుడూ రియల్ డేట్ లో లేను“ అంటూ ఇల్లీ పెద్ద షాకిచ్చింది. తను చెప్పిన కఠోర సత్యం అవాక్కయ్యేలా చేస్తోంది. ఏదో ఫన్ కోసం ఫ్యాన్సీ రెస్టారెంట్ కి వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ మంచి మ్యూజిక్ వింటూ ఇద్దరం కలిసి ఎంటర్ టైన్ అవ్వాలనే విధంగా .. దాని తర్వాత ఇంట్లో దింపడం వరకే. అది మాత్రమే వర్కవుట్ అవుతుంది.. రిలేషన్ షిప్స్ కొన్ని ఆదర్శవంతంగా మారవు“ అంటూ ఇచ్చిన స్టేట్ మెంట్ యూత్ లో వైరల్ గా మారింది.

“కొన్నిసార్లు .. ఏం జరగబోతోంది అన్నది చూడాలి అంతే“ అంటూ బ్రేకప్ వ్యవహారంలో పాజిటివిటీని చూపించే ప్రయత్నం చేసింది. మొత్తానికి రియలైజేషన్ లో భాగంగా ఇలియానా తనని తాను చాలానే విశ్లేషించుకుందని భావిస్తుంటే ఇలా అనేసిందేమిటో. అన్నట్టు ఇలియానాలానే క్యాండిల్ లైట్ డిన్నర్ వరకే అనుకునే ఆండ్రూ కూడా ప్రేమించాడా? అన్నది అతడే చెప్పాల్సి ఉంది. చూస్తుంటే ఈ ఇద్దరూ ఫన్ కోసమే లవ్ చేస్కున్నారా? అన్న సందేహాలొస్తున్నాయ్. సోషల్ మీడియా ఖాతా నుంచి అన్ ఫాలో చేసుకున్నంత ఈజీగా.. ఘాడానుబంధానికి సంబంధించిన ఫోటోల్ని డిలీట్ చేసినంత ఈజీగా ప్రేమను కూడా మనసులోంచి తీసేయడం కుదురుతుందా? మరీ అంత అపరిపక్వ ప్రేమ ఎవరికీ అర్థం కాకుండా పోతుందా ఏమిటీ!
Please Read Disclaimer