గోవా బ్యూటీకే ఓటేస్తున్న డైరెక్టర్!

0

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీను వైట్ల ఇప్పుడు తన కెరీర్లో చాలా డౌన్ ఫేజ్ లో ఉన్నాడనే సంగతి తెలిసిందే. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న వైట్ల ‘అమర్ అక్బర్ అంటోనీ’ పై నమ్మకం పెట్టుకుంటే.. ఆ సినిమాకూడా నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు వైట్ల తన కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

మంచు విష్ణు హీరోగా ‘ఢీ’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఢీ’ రిలీజ్ అయిన సమయంలో హీరో విష్ణు తో పాటు వైట్లకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో సీక్వెల్ ను కూడా హిలేరియస్ ఎంటర్టైనర్ గా మలిచేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మొదట విష్ణుకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకుందామని అనుకున్నారట. రకుల్ కూడా ఈ సినిమాలో నటించేందుకు సరే అన్నదట. కానీ తాజా సమాచారం ప్రకారం వైట్ల మరో హీరోయిన్ ఇలియానా ను తీసుకుందామని అనుకుంటున్నాడట. మరి సినిమాలో పాత్ర పరంగా అలాంటి నిర్ణయం తీసుకున్నాడా లేదా రెమ్యూనరేషన్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఇల్లీ బేబీ కి ఓటేశాడా అనేది ఇంకా తెలీదు.

ప్రస్తుత పరిస్థితిలో ఇలియానా తో పోలిస్తే ఆడియన్స్ లో రకుల్ కే ఎక్కువగా క్రేజ్ ఉంది. పైగా ‘అమర్ అక్బర్ అంటోనీ’ లో ఇలియానా లుక్స్ విషయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. మరి అవన్నీ పట్టించుకోకుండా వైట్ల గోవా బ్యూటీనే ఫైనలైజ్ చేస్తాడా.. లేదా రకుల్ నే తీసుకుంటాడా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer