బ్రేకప్ తర్వాత: ఇల్లీ ఫేసులో నవ్వు ఇల్లై..!

0

గోవా బ్యూటీ ఇలియానా డిక్రజ్ తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ చేసుకోడం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. తను స్వయంగా ‘బ్రేకప్’ అని వెల్లడించకపోయినా ‘అన్ ఫాలో’ చేయడం.. ఫోటోలను డిలీట్ చేయడంతో తెలివైన మెరుగైన ముంబై సమాజానికి సంబంధించిన ప్రజలు వెంటనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇది మిగతా వారికి కూడా అర్థం అయిపోయింది. నిజానికి ఇల్లీ బేబీ.. అండ్రూ బాబుల బ్రేకప్ ఇప్పుడు ఓల్డ్ న్యూస్ అయిపోయింది.

ఈ బ్రేకప్ సంగతి ప్రపంచానికి తెలిసిన తర్వాత ఇల్లీ డిప్రెషన్ లోకి వెళ్లిందని ఇప్పట్లో బయట అడుగుపెట్టదని కూడా అన్నారు. అయితే డిప్రెషన్ లో ఉందో లేదు దేవుడెరుగు.. బయటకు అడుగుపెట్టడం.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. ఈ ఫోటోలలో ఇల్లీ బయటకు వచ్చి కారు ఎక్కుతోంది.. వైట్ షర్టు.. బ్లాక్ కలర్ పలాజో ప్యాంట్ ధరించి ఒక స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ ను భుజానికి తగిలించుకుని కారు ఎక్కింది. మధ్యలో తన ఫోన్ ను చెక్ చేసుకుంది. అయితే ఈ ఫోటోలలో ఇల్లీ బేబీ మొహం పెద్దగా కనిపించలేదు. ఫేస్ కనిపించిన ఒక ఫోటోలో కూడా సీరియస్ ఎక్స్ ప్రెషన్ ఉంది. ఇల్లీ బేబీ వాలకం చూస్తుంటే ఇంకా బ్రేకప్ బాధలో నుంచి బయటకు వచ్చినట్టు అనిపించడం లేదు.

అలా కనిపిస్తే తప్పేమీ లేదు. పొరపాటున ఈ ఫోటోలో ‘నవ్వింది మల్లెచెండు’ రాధిక టైప్ లో కిక్కి కికికి కి అని నవ్వితే బాలీవుడ్ మీడియా ఊరుకుంటుందా..?నెటిజెన్లు ఊరుకుంటారా? కూసింత కూడా బాధలేని కఠిన హృదయం అని ఆడిపోసుకుంటారు. తీవ్రంగా ట్రోలింగ్ చేస్తారు. ఈ సిట్యుయేషన్లో మాత్రం ‘నవ్వు నాలుగు విధాల చేటు.’ అయినా ఇలాంటి విషయాలు గోవా వారికి తెలిసే ఉంటాయి లెండి.
Please Read Disclaimer