ఇలియానా ఖరీదైన కోరిక.. దాని కోసం సంపాదన

0

గోవా బ్యూటీ ఇలియానా కెరీర్ దాదాపుగా ఖతం అయినట్లే అనిపిస్తుంది. బాలీవుడ్ మరియు సౌత్ లో ఈ అమ్మడి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి సమయం లో ఈమె ఒక ఖరీదైన కోరిక తనకు ఉన్నట్లు గా తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల ద్వారా వచ్చిన డబ్బు తో గోవాలో ఒక ఇల్లు తీసుకోవాలని కోరుకుంటున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. అయితే అది మామూలు ఇల్లు కాదట.. సముద్రం కు అభి ముఖంగా ఉండే ఇల్లును ఇలియానా తీసుకునేందుకు సిద్దం అవుతుందట.

గోవా లో ప్రస్తుతం తమకు ఇల్లు ఉందని.. అది సముద్రానికి దగ్గరగానే ఉందని కాని సముద్రం ఫేసింగ్ తో లేదని ఇలియానా చెప్పుకొచ్చింది. అందుకే సముద్రం కు ఎదురుగా ఇల్లు కట్టు కోవాలనేది నా జీవిత ఆశయం అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది. ఆ ఇంటిని పూర్తిగా నా అభిరుచికి తగ్గట్లు గా డిజైన్ చేయించుకుంటాను అని.. అందులో సకల సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా ఇలియానా తన డ్రీమ్ ను ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

అలాంటి ఇంటి కోసం నాకు చాలా డబ్బులు కావాలి. అందుకే డబ్బు సంపాదించేందుకు కష్ట పడుతున్నట్లు గా చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాది వరకు అయినా నా కల నెర వేరుతుందా అంటూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నట్లు గా ఇలియానా చెప్పుకొచ్చింది. అయితే ఖచ్చితంగా నా కలను నెర వేర్చుకుని తీరుతాను అంటూ బలంగా ఇలియానా చెప్పింది.

ఆమద్య పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వబోతుందనే వార్తలు వచ్చాయి. కాని బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవ్వడం తో ఈ అమ్మడు మళ్లీ సినిమాల పై దృష్టి సారించింది. అవకాశాల కోసం పరిచయస్తుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు గా సమాచారం అందుతోంది. తెలుగులో కూడా ఈమె సినిమాలు వరుసగా చేసేందుకు చాలా ఆసక్తి గా ఉందట.
Please Read Disclaimer