ఇల్లీ మామూలుగా సంపడం లేదే

0

గోవా బ్యూటీ ఇలియానా ఈమధ్య బ్రేకప్ విషయంలో వార్తల్లో నిలిచింది. ఆ హంగామా పూర్తయిన తర్వాత కొత్తమనిషిగా మారిపోయింది. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో బాదరబందీలు లేవు కాబట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా తన కెరీర్ పై మునుపటిలా ఫోకస్ చేస్తోంది. హాటు డ్రెస్సులతో ఫోటో షూట్లు చేస్తూ అప్పుడప్పుడూ బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మళ్ళీ గ్లామర్ ప్రపంచంలో తన ఘనతను చాటుతోంది.

ఇల్లీకి ముంబై మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే ఇల్లీ కనిపిస్తే చాలు వెంటనే ఫోటోలు తీస్తారు.. క్షణం కూడా ఆలస్యం కాకుండా ఆ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చేస్తాయి. రీసెంట్ గా మరోసారి అలాగే జరిగింది. ఇల్లీ బేబీ ఒక డిజైనర్ డ్రెస్ లో ఏదో కార్యక్రమానికి హజరయ్యేందుకు బయటకు అడుగుపెట్టింది. బ్లౌజ్ లాగా కనిపిస్తున్న మెరూన్ కలర్ టాప్.. లేహంగా స్టైల్ లో ఉన్న క్రీమ్ కలర్ చీర కట్టుకుని ఒక అందాలబొమ్మలా నడుచుకుంటూ వచ్చింది. డార్క్ కలర్ లిప్ స్టిక్ తో పాటుగా ఫుల్ మేకప్.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించి సూపర్ స్మైల్ ఇచ్చింది. అయితే హైలైట్ మాత్రం అవన్నీ కాదు.. డీప్ వీనెక్.

ఈ ఫోటోలలో ఇల్లీ మరీ స్లిమ్ గా ఏమీ కనపడడం లేదు. కాస్త చబ్బీగానే ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాగల్ పంటి’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ‘ది బిగ్ బుల్’ అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer