బ్రేకప్ తర్వాత డిప్రెషన్ లో ఇలియానా?

0

గోవా బ్యూటీ ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే సినిమా లవర్ ఎవరైనా వెంటనే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబోన్ అని తడుముకోకుండా చెప్పేస్తారు. ఇల్లీ బేబీ కూడా ఆండ్రూ ను ‘హబ్బీ’ అని పిలవడం.. తెలిసిన విషయాలే. ఇద్దరి పెళ్ళి ఎప్పుడో అయిందని.. ఇల్లీ గర్భవతి అని కూడా కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. గత కొన్నేళ్ళుగా ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఆ ప్రేమకు ఇప్పుడు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడిపోయింది.

ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుండి ఒకరి ఫోటోలను ఒకరు డిలీట్ చేశారు. ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీన్ని ఆధునిక సామాజిక మాధ్యమాల పరిభాషలో ‘బ్రేకప్’ అంటారు. ఇక ఇలియానా వేదాంత ధోరణిలో కొటేషన్ లు కూడా పెట్టడం మొదలుపెట్టింది. ఓ పదిహేను రోజుల క్రితమే ఈ బ్రేకప్ కు హింట్ అన్నట్టుగా “ప్రతిసారి ప్లాన్ అవసరం లేదు.. ఊపిరి పీల్చుకోవాలి.. నమ్మాలి.. వదిలెయ్యాలి.. ఏమౌతుందో చూడాలి” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. నిజానికి అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. కానీ ‘ఐ వానా అన్ ఫాలో అన్ ఫాలో యూ’ అన్న తర్వాతే బ్రేకప్ సంగతి కన్ఫాం అయింది. తాజాగా బ్రేకప్ అయిన తర్వాత మరో కొటేషన్ లో “ఒక్కోసారి దించేసిన తర్వాత కానీ నీ భుజాలపై ఎంత బరువు మోస్తున్నావో తెలియదు” అంటూ లవ్ ఫిలాసఫీ చెప్పింది

ఇదిలా ఉంటే ఇల్లీ – అండ్రూ తమ మధ్యనున్న విభేదాలను పరిష్కరించుకోలేకపోవడంతో తీవ్రంగా గొడవపడ్డారని .. విడిపోయారని ఓ బాలీవుడ్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. అయితే ఆ విభేదాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ విభేదాల ఏంటనే విషయంపై మాత్రం సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అవన్నీ పక్కన పెడితే ఇల్లీ బేబీ ప్రస్తుతం డిప్రెషన్ లో ఉందని సమాచారం. అసలే ఈమధ్య అవకాశాలు లేవు.. పైగా గోరుచుట్టుపై రోకటిపోటులా అండ్రూతో బ్రేకప్పు.. దీంతో తీవ్రంగా నిరాశలో కూరుకుపోయిందట. మరి గోవా బ్యూటీకి బ్రేకప్ నుండి ఎలా బయటకు రావాలనే విషయంలో చెన్నై హాటీ శ్రుతి హాసన్ ఏవైనా సూచనలు.. సలహాలు ఇస్తే బాగుంటుంది కదా. ఎంతైనా శ్రుతి ఇట్టాంటి విషయాల్లో యమా సీనియర్ కదా!
Please Read Disclaimer