ఇల్లీ బేబీపై మళ్లీ ఈ గుసగుసలేమిటో

0

తెలుగులో ఓ ప్రముఖ హీరోతో అభిప్రాయబేధాలు తలెత్తడంతో ఉన్నట్టుండి క్రేజ్ వుండగానే ఇలియానా బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ డెబ్యూ నాయికగా అదరగొట్టింది. టాప్ స్టార్స్ రణబీర్ కపూర్.. ప్రియాంక చోప్రాతో కలిసి నటించిన `బర్ఫీ` ఇలియానాకు మంచి పేరే తెచ్చింది. అటుపై అజయ్ దేవగన్ సరసన ఓ రెండు చిత్రాల్లో నటించింది. అయినా ఎందుకనో ఇటీవల ఇలియానా కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. ఆశించిన అవకాశాల్ని పొందలేకపోతోంది.

ఆ క్రమంలోనే మనసు మార్చుకున్న ఇలియాన సౌత్ వైపు చూస్తోంది. మాస్ మహారాజా రవితేజా సరసన చివరి ప్రయత్నంగా `అమర్ అక్బర్ ఆంటోని` ఛాన్సొచ్చినా పరాజయం పాలవ్వడం ఇలియానా ఆశల్ని ఆవిరి చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో ఇలియానా మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. అయినా అక్కడా సీన్ ఏదీ మారలేదు. తనని వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్లని మాత్రమే అందిపుచ్చుకుంటూ సినిమాలు చేస్తోంది.

అయితే ఇటీవల మరో ఊహించని ట్విస్టు. ప్రియుడు ఆండ్రూ నీబోన్ కి బ్రేకప్ చెప్పేశాక ఇల్లీ పరిస్థితిలో మార్పు వచ్చిందట. తనకు ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో దేవగన్ అండగా నిలుస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఆ హీరో ఇల్లీ బేబీకి మరో అవకాశం ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ దేవగన్ తో కలిసి ఇలియానా వరుసగా బాద్ షాహో- రైడ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అజయ్ దేవ్ గన్ నిర్మిస్తున్న `బిగ్ బుల్` చిత్రంలోనూ అవకాశం అందుకుందట. దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న కొత్త పుకార్ మొదలైంది. అయినా దేవగన్ వెంట కాజోల్ లాంటి స్టెన్ గన్ ఉండగా.. ఇలియానా పప్పులుడుకుతాయా? అంటూ ఓ సెక్షన్ గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
Please Read Disclaimer