ఇల్లీ బేబీ బ్రేకప్ వేదాంతం..!

0

గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ ఈమధ్య వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ప్రియుడు అండ్రూ నీబోన్ తో విడిపోయిందని.. ఇద్దరూ ఒకరికి ఒకరు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇంతవరకూ ఇలియానా అధికారికంగా స్పందించలేదు. అయితే రీసెంట్ గా ఇలియానా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా దీనిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.

“అవును. మన జీవితంలో స్నేహితులను.. కుటుంబ సభ్యులను.. జీవితం భాగస్వాములను కోల్పోయే సందర్భాలు వస్తాయి. అయితే మన జీవితంనుండి ఎవరు వెళ్ళిపోయినా మనల్ని మనం మాత్రం కోల్పోకూడదు. లైఫ్ లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. మనల్ని మనచుట్టూ ఉండేవారు ప్రేమించడం లేదని మనకు తెలిసినప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి.. మనకు మనమే తోడుగా నిలవాలి” అంటూ ఒక ఫిలాసఫీ చెప్పింది. ఇల్లీ బేబీ ఇందులో చెప్పినవన్నీ నిజమే కదా. ఎవరున్నా లేకపోయినా మనకు మనం ఉన్నామని ధైర్యంగా ఉండడం ఎప్పుడూ మంచిదే. రఫ్ గా చెప్పుకుంటే ‘తొక్కలోది.. జనాలు ఉంటే ఎంత.. పోతే ఎంత’ అనుకోవాలి. లేకపోతే ఈ లోకంలో బతకలేం!

ఇలాంటి డీప్ ఫిలాసఫీ లతో పాటుగా పాత బికినీ ఫోటోలను వెతికి మరీ పోస్ట్ చేస్తూ ఇల్లీ మళ్ళీ నార్మల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇలియానా ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాగల్ పంటి’ చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer