సినిమా ఆఫర్లు లేక ఇలా అంటావా ఇల్లీ బేబీ?

0

అందని ద్రాక్ష పుల్లన! అన్న చందంగా ఉందీ అమ్మడి వ్యవహారం. ఇన్నాళ్లు సినిమా ఛాన్సుల్లేక అల్లాడిపోయిన ఇలియానా ఇప్పుడు ఓటీటీ ఆఫర్లు కళ్ల జూడడంతో మాట మార్చేస్తోంది. కార్పొరెట్ పైకం మత్తు చల్లిందో ఏమో కానీ.. సినిమాలకంటేనే ఓటిటిల్లోనే యాక్ట్ చేయడమే బెటర్ అంటూ కొత్త పల్లవి అందుకుంది ఇలియానా..!

తాజాగా ముంబై కాస్టింగ్ ఏజెంట్ల సమాచారం మేరకు.. ఇలియానా నెట్ ఫ్లిక్స్ తో అలానే ఆల్ట్ బాలాజీ వాళ్లతో డీల్ కుదుర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఓ వెబ్ సిరీస్ లో తాను నటించేందుకు మరో వెబ్ సిరీస్ కి నిర్మాతగా మారేందుకు ఇల్లి బేబి సన్నాహాలు మొదలుపెట్టిందని అంటున్నారు. ముఖ్యంగా ఇల్లి బేబికి బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పేరుండటంతో సదరు ఓటీటీలు కూడా ఈ బ్యూటీతో భారీ మొత్తానికి డీల్ చేసుకోవడానికి సముఖంగానే ఉన్నాయని తెలిసింది.

అయితే మరీ ఇలా ఓటీటీ ఆఫర్లు రాగానే నాలుక మడత పెట్టేయడం ఏం బాలేదన్నది అభిమానుల మాట. ప్రస్తుత మహమ్మారీ క్రైసిస్ నుంచి బయటపడే వరకూనే ఓటీటీ. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా సినిమా రంగం వర్థిల్లుతుందనడంలో సందేహమేం లేదు. అయినా పెద్ద తెర పెద్దతెరే.. బుల్లితెర ఓటీటీతో పోలికే లేనిది. బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినందుకు ఇలా మాట మార్చడం సరికాదన్నది సినీవర్గాల మాట.