నా బాడీ మీద అవి ఐదు ఉన్నాయి…!

0

ఇలియానా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ గోవా బ్యూటీ. ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘పోకిరి’ చిత్రంలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అదే ఊపుతో వరుసగా తెలుగు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఈ భామ బాలీవుడ్లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ లో ఇల్లి బేబీ పరిస్థితి అంతా మారిపోయింది. ఆరంభంలో బాగానే ఉన్నా.. పోను పోను ఇలియానాకి బాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. అయితే ఈ బ్యూటీకి క్రేజ్ తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు ఇలియానా వర్కౌట్ వీడియోస్ మరియు వేడిపుట్టించే ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి చెమటలు పట్టిస్తోంది.

ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఇల్లీ బేబీ ఇంస్టాగ్రామ్ లో కాసేపు చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఫాలోవర్స్ అడిగే చిలిపి ప్రశ్నలకు సమాధానం చెప్పింది. మీ బాడీ మీద ఎన్ని టాటూస్ ఉన్నాయి అని ఒక నెటిజన్ అడుగగా 5 ఉన్నట్లు చేతి వేళ్ళు చూపిస్తూ ఆన్సర్ చెప్పింది. ఇక సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో సినిమాలు చూస్తూ టైంపాస్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఫేవరేట్ ఫుడ్ ఏమిటని అడుగగా భోజన ప్రియులను ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు అడగకండి అని చెప్పింది. రోజుకి ఎన్ని గంటలు వర్కౌట్స్ చేస్తారని అడుగగా ఒక రోజు వన్ అవర్ చేస్తే మరో రోజు 45 మినిట్స్ చేస్తాను.. ఒక్కొక్కసారి 30 మినిట్స్ వర్కౌట్ చేస్తా.. అప్పుడప్పుడు యోగా చేసి స్ట్రెస్ తగ్గించుకుంటా అని వెల్లడించింది. కాగా ఇలియానా నటించిన ‘ది బిగ్ బుల్’ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక కింగ్ నాగార్జునతో ఇలియానా నటించబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer