టాలీవుడ్ నెపోటిజంపై ఇలియానా షాకింగ్ కామెంట్!

0

ఏరు దాటాక తెప్ప తగలేయడమెలానో మన కథానాయికల్ని చూసి నేర్చుకోవాలి. ఇంతకుముందు తనకు తొలి సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావుపైనే తీవ్ర ఆరోపణలు చేసింది తాప్సీ పన్ను. శ్రీదేవి- జయప్రద లాంటి హీరోయిన్ల బొడ్డుపై పూలు పండ్లు వేస్తారని విన్నాను. కానీ నా బొడ్డుపై ఏకంగా కొబ్బరి చిప్ప వేశారని ఆరోపించింది. అప్పటికి తాను అసలు అందుకు ప్రిపేర్డ్ గా లేనని కూడా అంది. అలాంటి సన్నివేశం తీయనిదే నిదురపట్టదా!! అంటూ సూటిపోటి మాటలు అనేసింది. ఇక్కడ తట్టా బుట్టా సర్దేసి బాలీవుడ్ వెళ్లాక తాప్సీ మాట మార్చిందని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తనకు సినీజీవితాన్నిచ్చిన రాఘవేంద్రునిపైనే ఆరోపిస్తుందా? అంటూ అభిమానులు తాప్సీని ఓ రేంజులో ఆడుకున్న సంగతి తెలిసినదే.

తాప్సీ ఎపిసోడ్ ముగిసింది అనుకుంటే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా ఇదే తీరుగా ఆరోపించింది. అయితే ఇలియానా మాత్రం టాలీవుడ్ లో నెపోటిజం అన్న టాపిక్ పై ముచ్చటిస్తూ నోరు జారి బుక్కయ్యింది. ఇంతకీ ఇలియానా ఏమంది? అంటే.. టాలీవుడ్ మొత్తం నేపోటిజంపైనే రన్ అవుతుంది అంటూ ఘాటైన విమర్శనే చేసింది. కొత్త వాళ్లు టాలీవుడ్ లో ఎదగడం చాలా కష్టం అనేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం అనంతరం నెపోటిజం పెద్ద డిబేట్ అయ్యింది. ఆ క్రమంలోనే ఇంటర్వ్యూలో ఇలియానా ఇలాంటి ఊహించని కామెంట్ చేసింది.

ఐతే దీనికి టాలీవుడ్ ప్రముఖులు ఏమంటున్నారు? అంటే… హీరోయిన్స్ అందరు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీ లోకి వస్తున్నారుగా మరి వాళ్ళని ఎవరూ కెరీర్ లో ఎదగనీయకుండా అణగదొక్కేయడం లేదు కదా? ఎందుకిలాంటి ఆరోపణలు చేస్తోంది. ఏరు దాటాక తెప్ప తగలేస్తోందా? అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. బాలీవుడ్ కి వెళ్లిపోయాక టాలీవుడ్ ని మర్చిపోయిన ఇలియానా ఇలా ఉన్నట్టుండి ఎందుకని ప్లేటు ఫిరాయించింది? అంతా మర్చిపోయాక.. మొన్న మాస్ మహారాజా రవితేజ అభిమానంగా పిలిచి మరో ఆఫర్ ఇచ్చినందుకా? లేక ఆ తర్వాత నటవారసులు అయిన అగ్ర హీరోలు ఎవరూ తనకు ఆఫర్ ఇవ్వలేదనా?