అంత దారుణ స్థితిలో ఇల్లీ ఉండేదట

0

ప్రేమలో ఉండే మేజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదే ప్రేమ కొందరికి వరంగా మారితే మరి కొందరికి మాత్రం శాపమవుతుంది. టాలీవుడ్ లోనూ.. బాలీవుడ్ లోనూ ఒక వెలుగు వెలిగిన బక్కపల్చటి భామ ఇలియానా ఉదంతం చూస్తే.. అయ్యో అనిపించక మానదు. కెరీర్ మాంచి ఊపులో ఉన్న వేళ ఆస్ట్రేలియా కు చెందిన ఆండ్రూ అనే ఫోటో గ్రాఫర్ ప్రేమ లో పీకల్లోతు కూరుకు పోయిన వైనం తెలిసిందే.

అదే ఆమె కు తీరని వేదనను మిగల్చటమే కాదు.. ఆసుపత్రుల చుట్టూ తిరిగేలా చేసిందన్న షాకింగ్ నిజం ఆమె వెల్లడించింది. మనస్పర్థలతో ఇద్దరి మధ్య జరిగిన గొడవలతో లవ్ ఫెయిల్ అయ్యి.. బ్రేకప్ జరిగిపోయింది. పీకల్లోతుల్లో మునిగిన ప్రేమలో నుంచి బయటకు రాలేని ఆమె మానసికంగా తీవ్రంగా కుంగి పోయింది. సోషల్ మీడియాలో తమ ప్రేమ గురుతుల్ని తుడిపేసినా.. మానసికంగా మాత్రంమర్చిపోలేకపోయింది.

దీంతో.. ఆ మనో వేదన నుంచి బయటకు పడేందుకు ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో నటించే అవకాశాలు వచ్చినా వదులుకున్న దుస్థితి. మానసిక వేదనతో ఒక దశలో రోజుకు 12 మాత్రలు వేసుకునేదానినని చెప్పిన ఇలియానా. .ఈ కారణంతో తాను బరువు పెరిగపోయినట్లు చెప్పింది. బరువు తగ్గేందుకు జిమ్ కు వెళ్లాలని అనుకున్నా.. వెళ్లలేక పోయినట్లు చెప్పింది.

జిమ్ కు వెళితే.. తన ఫోటోల్ని తీసి ఎక్కడ సోషల్ మీడియాలో పోస్టు చేస్తారన్న భయంతోనే తాను ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయినట్లు చెప్పింది. అందుకే జిమ్ మానేసి ఇంట్లో నుంచి బయటకు రాలేక.. ఏకాంతంగా ఉండిపోయినట్లు చెప్పింది. మొత్తానికి ప్రేమ ఆమెకు ఎంత భయంకరమైన అనుభవాన్ని మిగిల్చిందో చెప్పిన ఇలియానా మాటలు వింటే.. అయ్యో అనిపించక మానదు.
Please Read Disclaimer