కుర్రహీరోలేనా అమ్మడికి ముదుర్లు నచ్చరా?

0

అందివచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోకపోతే పరిస్థితిని ఊహించగలం. ప్రస్తుతం గోవా బ్యూటీ ఇలియానా సన్నివేశం అదే. తనని వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్లను కాదనుకుంది. సీనియర్ హీరోలంటే మొహం మొత్తేసినట్టే వ్యవహరించింది. పైగా కుర్రహీరోలే ముద్దు.. ముదుర్లు వద్దే వద్దు! అన్నట్టుగా వాలకం కనిపించడంతో ఇక ఎవరూ తనని సంప్రదించడమే మానేశారు.

అన్నివేళలా ఒకేలా ఉండదు. టైమ్ ఛేంజ్ అవుతుంటుంది. భూమి గుండ్రంగా తిరిగి అక్కడికే వచ్చినట్టు.. ఇలియానా సీన్ ప్రస్తుతం తిరిగి అక్కడికే వచ్చింది. ఇన్నాళ్లు బాలీవుడ్ మోజులో సౌత్ ఆఫర్లను కాదనుకుంది. సీనియర్లలో ఒక్క రవితేజ తప్ప ఇంకెవరూ వద్దని తెలుగులో ఏ అవకాశం వచ్చినా తిరస్కరించింది. ఇలియానా తిరస్కరించినవి ఎంతో క్రేజీ ఆఫర్స్. నందమూరి బాలకృష్ణ-కే.ఎస్.రవికుమార్ కాంబినేషన్ చిత్రం `రూలర్` లో తొలి ఆప్షన్ తనే. ఆఫర్ వస్తే సరైన ఆన్సర్ ఇవ్వలేదు. మరో క్రేజీ మూవీ `వెంకీ మామ`లోనూ వెంకీ సరసన ఛాన్సొచ్చింది. కానీ అది కూడా వదులుకుంది. ఆ తర్వాత ఆ ఛాన్స్ పాయల్ రాజ్ పుత్ కి దక్కింది. మహేష్ `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోనూ ఐటెమ్ నంబర్ ఛాన్స్ ఇచ్చారు. కానీ అది కూడా కాదనుకోవడంతో తమన్నాకు ఆ ఛాన్స్ వెళ్లిపోయింది. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి.

అయితే అప్పుడు కాదనుకుని ఇప్పుడు కావాలనుకుంటే ఛాన్సులొస్తాయా? అందుకే ఇలియానా తిరిగి సౌత్ లో నటించాలన్న ఆసక్తిని కనబరుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదట. బంగారం లాంటి ఇన్ని పెద్ద ఛాన్సులు కాదనుకుంది. కుర్ర హీరోలతో ఛాన్సులొస్తాయని ఆశించింది. కానీ ఎవరూ కనికరించడం లేదు మరి. ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాల్లో రెగ్యులర్ బేసిస్ లో బికినీ ఫోటోలతో వేడి పెంచుతోంది. సౌత్ లో రీఎంట్రీ కోసం తపనలో భాగమే ఇదంతా. కానీ ఫలితం మాత్రం లేదు.
Please Read Disclaimer