ఇంకా అలాగే ఉందిగా!

0

ఇలియానా.. ఈ పేరును టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులో ఈమె పలు బ్లాక్ బస్టర్.. సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో మొదటి కోటి హీరోయిన్ అంటూ ఈమెకు అరుదైన రికార్డు కూడా ఉంది. అలాంటి ఇలియానా తెలుగులో స్టార్ గా దూసుకు పోతున్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కొంత కాలం బాగానే హవా కొనసాగించింది. ఈమద్య కాస్త డల్ అయ్యింది. దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇలియానా తిరిగి తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో నటించింది.

రవితేజకు జోడీగా ఆ చిత్రంలో నటించిన ఇలియానాను చూసి అంతా అవాక్కయ్యారు. ఇలియానా చాలా లావు అయ్యిందని.. మునుపటి ఇలియానే బాగుండేది అంటూ కామెంట్స్ వచ్చాయి. దానికి తోడు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది. దాంతో తెలుగులో మళ్లీ తెలుగులో కనిపించలేదు. గత ఏడాది వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఎలా అయితే ఉందో ఇంకా అదే ఫిజిక్ తో ఇలియానా ఉంది. ఏమాత్రం బక్కగా అవ్వలేదు.

సన్నబడి తెలుగు ఇండస్ట్రీలో ఈ అమ్మడు మళ్లీ బిజీ అవుతుందని అనుకున్న వారికి షాక్ ఇస్తూ బరువు తగ్గే ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. ఇటీవల ఇలియానా మీడియా కంట పడింది. ఆసమయంలో మీడియా వారు తమ కెమెరాలకు పని పెట్టారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇలియానా ఏమాత్రం తగ్గక పోవడంతో పాటు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కనిపించినదానికంటే కాస్త బరువు ఎక్కువగానే అయినట్లుగా అనిపిస్తుంది. లావుగా ఉండటం వల్ల ఇలియానా మొహంలో మునుపటి గ్లో లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer