ఇలియానా అన్ వాంటెడ్ మిస్టేక్స్

0

గోవా బ్యూటీ ఇలియానా ఈతి బాధల గురించి తెలిసిందే. ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ అయ్యింది మొదలు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఇలియానా మీడియా వేదికలుగా ఇంటర్వ్యూల్లో రకరకాల షాకింగ్ విషయాల్ని రివీల్ చేస్తోంది.

తాజాగా తన కెరీర్ లో మిస్ చేసుకున్న ఓ రెండు ఇంపార్టెంట్ సినిమాల గురించి చెప్పి షాకిచ్చింది. ఇలియానా ఏడేళ్లుగా బాలీవుడ్ లో కెరీర్ సాగిస్తున్నా ఖాన్ ల సరసన ఎందుకు నటించలేదు? అన్నదానికి సమాధానం ఇస్తూ అసలు సంగతిని రివీల్ చేసింది.

వాస్తవానికి ఈ అమ్మడికి సల్మాన్ భాయ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. కానీ తనే వదులుకుంది. అయితే అందుకు కారణాలు లేకపోలేదు. సల్మాన్ నటించిన వాంటెడ్- కిక్ చిత్రాల్లో తొలి ఆప్షన్ ఇలియానానే. కానీ వాంటెడ్ ఆఫర్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ రాస్తోందట. కిక్ సినిమా సమయంలో వేరొక సినిమాకి కమిటైంది. దాంతో డేట్స్ సమస్య వచ్చింది. అందుకే ఆ రెండూ వదులుకోవాల్సి వచ్చిందట. కిక్ లో నటించాలనుకున్నా చేయలేకపోయానని ఆవేదన వెల్లగక్కింది. వాంటెడ్ పోకిరి కి రీమేక్. కిక్ తెలుగు కిక్ కి రీమేక్. ఆ రెండిటిలోనూ ఇలియానా నటించినా హిందీ వెర్షన్లకు ఓకే చెప్పలేకపోయింది. బాలీవుడ్ లో వాంటెడ్- కిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఇలియానాకు ఛాన్స్ మిస్సవ్వడం బ్యాడ్ లక్. ప్రస్తుతం ఈ భామ నటించిన పాగల్ పంతి థియేటర్లలో ఉన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer