ఈ పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం

0

తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో జన్మించిన ఆయన సినిమాపై ఆసక్తితో ఆస్తులను అమ్మి సినిమాలను నిర్మించారు.. తీశారు.. థియేటర్ ను నిర్మించారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన వారిలో ముఖ్యడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన జీవితం మొత్తం కూడా సినిమాకు అంకితం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్ ను సీనియర్ నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్నారు.

‘రఘుపతి వెంకయ్య నాయుడు’ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించిన విశేషాలను నరేష్ వెళ్లడించాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమాను శ్రీలంక వరకు తీసుకు వెళ్లిన గొప్ప వ్యక్తి. నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా తెలుగు సినిమాకు సేవ చేశారు. ఆస్తులను తాకట్టు పెట్టి మరీ తెలుగు సినిమాను విస్తరించేందుకు విశేషంగా కృషి చేశారు. అంతటి గొప్ప వ్యక్తి పేరు మీదున్న జాతీయ అవార్డును అమ్మకు ఇచ్చిన సమయంలో ఆయన గురించిన చాలా విషయాలు నాకు తెలిశాయి. గూగుల్ లో నేను సెర్చ్ చేసి చాలా తెలుసుకున్నాను.

అప్పుడే దర్శకుడు బాబ్జీకి ఫోన్ చేసి ఈ సినిమా చేద్దామని చెప్పాను. వెంటనే అతడు కూడా ఓకే అనడంతో మా ప్రయాణం మొదలైంది. ఈ సినిమాను మండవ సతీష్ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమాను నా వెనకుండి పిల్లర్ మాదిరిగా నడిపించిన బాబ్జీ మరియు మండవ సతీష్ కృతజ్ఞతలు. 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. సినిమాను డాక్యుమెంటరీలా కాకుండా కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

రఘుపతి వెంకయ్య నాయుడు గారి పాత్రను ధరించే అవకాశం నాకు రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సినిమాను దాసరి గారు నిర్మించాలని ఆశ పడ్డారు. కాని ఆయన ఆశ తీరకుండానే స్వర్ఘస్థులయ్యారు. ఆ కారణంగానే సినిమా కాస్త ఆలస్యం అయ్యింది. ఈ సినిమాలో నటించడంతో నా జన్మ ధన్యం అయ్యిందని భావిస్తున్నట్లుగా నరేష్ పేర్కొన్నాడు.
Please Read Disclaimer