వెంకీ కుమార్తె లైఫ్ స్టైల్ పై టాప్ సీక్రెట్స్

0

సెలబ్రిటీ డాటర్స్ వ్యక్తిగత వృత్తిగత జీవితాలపై అభిమానులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఆన్ స్క్రీన్ కనిపించే స్టార్లకు సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి కానీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించి బయటకు తెలిసేది తక్కువే. ఆ కోవలోనే విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎఫైర్స్ పెద్దంతగా బయటి ప్రపంచానికి తెలీదనే చెప్పాలి. ఇంతకుముందు ఆయన పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహ సమయంలో ఫ్యామిలీ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.

ఆశ్రిత పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త సహా విదేశాల్లో స్థిరపడ్డారు. ఇకపోతే ఆశ్రిత హ్యాబిట్స్ వృత్తి గురించి కొంతవరకూ బయటికి తెలిసింది అప్పుడే. ఆమె ఇన్ ఫినిటీ ప్లేటర్ పేరుతో బేకరీ ఫుడ్స్ చైన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి వంటకాలపై ఆసక్తి అభిరుచి వల్లనే ఈ వ్యాపార రంగంపై మక్కువ పెరగడానికి కారణం. ఆశ్రిత ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఇన్ స్టా ద్వారా వంటకాలకు సంబంధించి టిప్స్ ఇవ్వడమే గాక.. ఇన్ ఫినిటీ ప్లేటర్ ప్రమోషన్ కూడా చేస్తున్నారు. స్వతహాగానే సిగ్గరి అయిన ఆశ్రిత కెమెరా ముందుకు వచ్చేందుకు ఇంకా శిక్షణ అవసరం అని భావిస్తున్నారట. తన సిగ్గును వదిలేయాలనుకుంటున్నానని తెలిపారు.

ఆశ్రితకు ఇప్పటికే సోషల్ మీడియాల్లో 82.7 కె ఫాలోవర్స్ ఉన్నారు. నాణ్యత గల ఫుడ్ పై ఆశ్రిత లెక్చర్లు ఆసక్తికరం. ప్రస్తుత సోషల్ మీడియా వర్చువల్ ప్రపంచంలో తనని తాను ఎలివేట్ చేసుకునేందుకు ఆశ్రిత సిద్ధమవుతున్నారు. అలానే ఫోటోగ్రఫీ పైనా తనకు ఉన్న అభిరుచి ప్రతిసారీ వెల్లడవుతూనే ఉంది.

అలాగే తన సోదరుడు .. పెదనాన్న కుమారుడు అయిన రానా దగ్గుబాటి ఫుడ్డింగ్ హ్యాబిట్ గురించి అభిరుచి గురించి ఆశ్రిత వెల్లడించారు. రానా దగ్గుబాటికి శనగ వెన్న చాక్లెట్ అంటే చాలా ఇష్టం అట. దానిని ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఎలా చేసుకుని తినాలో ఆశ్రిత నేర్పించారట. ఈ చాక్లెట్ ఎనర్జీ పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుందట. ప్రొటీన్స్ అధికంగా ఉండే ఫుడ్ ఇదని వెల్లడించారు. ఆశ్రిత ప్రస్తుతం తన భర్తతో పాటు బార్సిలోనాలో నివసిస్తున్నారు. వైట్ చాక్లెట్ ఓరియో ఫడ్జ్- పీనట్ బటర్ చాక్లెట్ ప్రోటీన్ – ఎగ్లెస్ చాక్లెట్ కుకీ- అరటి బ్రెడ్- ఫడ్డీ బ్రౌనీ వంటి వెరైటీల్ని ఆశ్రిత అద్భుతంగా తయారు చేస్తారట.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home