ఆస్కార్ చరిత్రలో తొలిసారి

0

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 92వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుక స్టార్స్ మద్య జరిగింది. హాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది పాల్గొన్న ఈ వేడుకలో ఉత్తమ చిత్రంగా కొరియన్ మూవీ పారసైట్ దక్కించుకుంది. మామూలుగా అయితే బెస్ట్ మూవీ మెయిన్ కెటగిరిలో కేవలం ఇంగ్లీష్ మూవీకే అవార్డు ఇవ్వాల్సి ఉంటుంది. కాని మొదటి సారి ఇంగ్లీష్ మూవీకి కాకుండా వేరే భాష మూవీకి మెయిన్ ఉత్తమ చిత్రం అవార్డును ఇవ్వడం జరిగింది.

ఉత్తమ చిత్రంగా మెయిన్ అవార్డును అందుకోవడంతో పాటు ఉత్తమ ఫారిన్ చిత్రంగా కూడా ఈ చిత్రం అవార్డును దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విషయం. ఈ కొరియన్ మూవీకి ఏకంగా నాలుగు అవార్డులు రావడంతో ఆస్కార్ ఆవార్డుల ప్రధానోత్సవం జరిగిన థియేటర్ మొత్తం కూడా ఈ సినిమా పేరుతో మారుమ్రోగిపోయింది.

ఈసారి ఇంగ్లీష్ భాష చిత్రంకు కాకుండా మెయిన్ స్ట్రీమ్ ఉత్తమ చిత్రం అవార్డును వేరే భాష చిత్రానికి ప్రకటించడంతో కొంత మంది గందరగోళంకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాని చివరకు పారసైట్ మూవీ మేకర్ అవార్డు అందుకోవడంతో ఈసారి అత్యుత్తమ చిత్రంగా అది నిలిచిందని అందరు అనుకున్నారు. మొత్తానికి ఈసారి పారసైట్ చిత్రం ఆస్కార్ ఆవార్డుల పంట పండించుకోవడం జరిగింది.
Please Read Disclaimer