ఆ టైంలో సుశాంత్ సింగ్ 50 ఫోన్ నంబర్లు మార్చాడు : స్టార్ డైరెక్టర్

0

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని చనిపోవడం యావత్ సినీ పరిశ్రమలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. సుశాంత్ ముంబై బాంద్రాలోని తన ప్లాట్ లో ఉరివేసుకొని బలవన్మరణం పొందాడు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో ఉండే నెపోటిజం మరియు కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే కారణమని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం బాలీవుడ్ కో బంధుప్రీతి ఉందని.. దాని వల్లే టాలెంటెడ్ యాక్టర్స్ కి న్యాయం జరగడం లేదని బాలీవుడ్ తీరుని తప్పుబట్టారు. సుశాంత్ కు కావాలనే అవకాశాలు రాకుండా చేశారని.. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయన్ను బాయ్ కాట్ చేసి సూసైడ్ చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేశారని ఆరోపించారు. గతవారం నుంచి బాలీవుడ్ పెద్దలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో సుశాంత్ పై పలు సందర్భాల్లో నెగిటివ్ కామెంట్స్ చేసిన కరణ్ జోహర్ అలియా భట్ సోనమ్ కపూర్ లాంటి వారిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తూ నిరసన తెలుపుతున్నారు.ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ ను సిల్వర్ స్క్రీన్ కి ‘కాయి పో చే’ సినిమాతో ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ అభిషేక్ కపూర్ మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుశాంత్ గురించి మాట్లాడుతూ అతనో డైమండ్ లాంటివాడు.. అతడ్ని కోల్పోవడమంటే చిన్న పిల్లాడిని కోల్పోయినట్టుందని తెలిపాడు. అలానే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా ‘కేదార్ నాథ్’ సినిమా షూటింగ్ రోజుల్లో సుశాంత్ దాదాపు 50 ఫోన్ నంబర్లు మార్చి ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా సమయంలో సారా అలీఖాన్ నే అందరూ ఫోకస్ చేసేవారని.. తనను పట్టించుకోవడం లేదని కూడా సుశాంత్ బాధ పడి ఉంటాడని చెప్పుకొచ్చాడు.

సుశాంత్ తో ఏడాదిన్నర పాటు మాట్లాడకుండా ఉన్నానని.. ఎన్నో మెసెజెస్ కాల్స్ చేసినా సుశాంత్ రెస్పాన్స్ ఇవ్వలేదని వెల్లడించాడు. అయితే సుశాంత్ బాధల్లో ఉన్నాడో లేదా బిజీగా ఉండి అలా చేశాడో కచ్చితంగా తెలియదని అభిషేక్ కపూర్ చెప్పుకొచ్చాడు.
Please Read Disclaimer