మళ్లీ విలన్ గా మారనున్న గోపిచంద్

0

టాలీవుడ్ హీరో జగపతి బాబు విలన్ గా మారడం ఓ సెన్సేషన్. జగ్గూ భాయ్ పెద్దగానే క్లిక్కయ్యాడు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటిస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించాడు. తెలుగు-తమిళ పరిశ్రమల్లో జగ్గూ భాయ్ హవా సాగింది. అయితే ఇటీవల జగపతిబాబు హవా తగ్గినట్టే అనిపిస్తోంది. జగపతి తరహాలోనే యాంగ్రీ హీరో రాజశేఖర్ విలన్ గా మారతాడని ప్రచారమైంది. కానీ ఆయన ఇంకా హీరోగానే సినిమాలు చేస్తున్నారు.

ఇప్పడు గోపిచంద్ వంతు వచ్చినట్టే అనిపిస్తోంది. ఇటీవల వరుస ఫ్లాపులతో గోపి కెరీర్ డైలమాలో పడింది.. వరుసగా ఆఫర్లు ఉన్నా కానీ హిట్టు లేకపోతే క్షమించని పరిశ్రమ కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్టే అర్థమవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో విలన్ గా నటించేందుకు గోపిచంద్ అంగీకరించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నందుకు అతడు హీరోగా అందుకునే పారితోషికాన్ని మించి ఛార్జ్ చేస్తున్నాడట. ఇంతకు ముందు జగపతిబాబు కూడా బాలకృష్ణ- రజనీకాంత్ లాంటి హీరోలకు విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు గోపిచంద్ అదే బాటలో వెళ్లనున్నాడని సంకేతం అందింది.

ఇక గోపీచంద్ కి విలనీ కొత్తేమీ కాదు. ఇంతకుముందు ప్రభాస్ `వర్షం`లో అదిరిపోయే విలనీ పండించాడు. పిలకముడితో మొరటోడిగా ఇరగదీశాడు. నితిన్ జయం లోనూ విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత మహేష్ – తేజ కాంబినేషన్ మూవీ `నిజం`లోనూ విలన్ గా ఇరగదీశాడు. మళ్లీ ఇప్పుడు రజనీకాంత్ సినిమాతో విలన్ అవతారం ఎత్తుతున్నాడు. ఇకపోతే కన్నడ హీరో కిచ్చా తరహాలోనే ఇరుగు పొరుగు పరిశ్రమల్లో విలన్ గా కనిపించబోతున్నాడా? కిచ్చా సుదీప్ లాగా గోపీచంద్ కూడా స్టైలిష్ విలన్ గా పక్క భాషల్లో క్రేజు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడా? అన్నది చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-