షాక్: ‘భారతీయుడు 2’ లుక్ లీక్

0

స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రమోషనల్ స్ట్రాటజీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. ఆయన సెట్ లో ఉన్నప్పుడు చండ శాసనుడు అని చెబుతారు. అక్కడి నుంచి ఒక్క ఫోటో గానీ.. క్లూ కానీ బయటకు వెళ్లడానికి వీల్లేదు. అంత పకడ్భందీగా ఏర్పాట్లు ఉంటాయి. కొన్నిసార్లు సెల్ ఫోన్లు సైతం షూటింగుకి తేనివ్వరని చెబుతారు. ఇంతకుముందు 2.0 విషయంలో అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే శంకర్ ఎంత జాగ్రత్త తీసుకున్నా ఏదో ఒక రూపంలో ఆన్ లొకేషన్ నుంచి స్టిల్స్ లీకై ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంది.

తాజాగా `భారతీయుడు 2`కి ఈ లీకుల బెడద తప్పలేదు. ఇంకా ఫస్ట్ లుక్ లో కీలకమైన ఫోటోల్ని రివీల్ చేయక ముందే .. ఆన్ లొకేషన్ నుంచి ఓ లుక్ లీకైపోయింది. విశ్వనటుడు కమల్ హాసన్ సేనాపతి గెటప్ లో ఓ గుర్రంపై వెళుతున్నారు. అది కూడా మార్కెట్ వీధుల్లో గుర్రంపై కూచుని టీవిగా స్వారీ చేస్తున్నాడు సేనాపతి. రెండు దశాబ్ధాల క్రితం సేనాపతి లుక్ వేరు. ఇప్పటి లుక్ వేరు. భారతీయుడు 1 నాటికి సేనాపతి వయసు 70 అయితే.. ఇప్పటికి సేనాపతి వయసు 90 కి చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఆ వయసు కనిపించేలా ఈ గెటప్ ని ఎలివేట్ చేశారు శంకర్.

సేనాపతి బ్యాక్ టు ద ఫామ్. మొత్తానికి అవినీతిపై సేనాపతి యుద్ధం పీక్స్ లో ఉండబోతోందని అర్థమవుతోంది. ఇకపై ఎవరి గుండెల్లో బాకు దిగుతుందో .. కత్తి పోటు వరించేది ఎవరినో కానీ.. ఇలా పబ్లిక్ వీధుల్లో గుర్రంపై స్వారీ చేస్తూ చాలానే హంగామా సృష్టిస్తున్నాడు. అదే మెరిసిన జుట్టు .. మెడలో కండువా.. నాటి స్వాతంత్య్ర సమరయోధుడి గెటప్.. చాదస్తం.. నియమనిబంధనలు.. వగైరా వగైరా సేమ్ టు సేమ్. బయటకు రిలీజైన రెండు ఫోటోల్లో కమల్ సిసలైన ఓల్డ్ మ్యాన్ ని తలపిస్తున్నాడు. అంత పక్కాగా మేకప్ వర్క్ ని చేశారని అర్థమవుతోంది. ఇక ఈ లీక్డ్ ఫోటోనే అభిమానులకు ఇంత మంచి ట్రీటిస్తే .. ఒరిజినల్ గా లుక్ లాంచ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.
Please Read Disclaimer