స్విట్జర్లాండ్ నుంచి విరుష్క జోడీ స్పెషల్ వీడియో

0

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతో కలిసి అభిమానులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో విహరిస్తున్న ఈ విరుష్క జోడీ.. అక్కడ నుంచే ఓ వీడియో ద్వారా అభిమానుల్ని పలకరించింది. తొలుత అభిమానులకి విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలియజేయగా.. అనంతరం అనుష్క శర్మ అందుకుంటూ కోహ్లీని హత్తుకుని మరీ విషెస్ చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

భారత్, వెస్టిండీస్ మధ్య ఇటీవల వన్డే సిరీస్ ముగియగా.. టీమిండియా 2-1తో సిరీస్ చేజిక్కించుకుంది. ఇక శ్రీలంకతో జనవరి 5 నుంచి మూడు టీ20 సిరీస్ మొదలుకానుండగా.. దొరికిన ఈ బ్రేక్ సమయాన్ని సరదాగా అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు. గత ఏడాది చివర్లో స్విట్లర్లాండ్ వెళ్లిన ఈ జంట.. గురువారం రాత్రికి మళ్లీ స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. 2017, డిసెంబరులో కోహ్లీ, అనుష్కలకి వివాహం జరగగా.. ఇటీవల భూటాన్‌లో రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే.

2019లో సూపర్ ఫామ్‌తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. సరికొత్త రికార్డుల్ని నెలకొల్పాడు. దీంతో.. విజ్డెన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు ప్రకటించిన తమ జట్లలోనూ అతనికి చోటు దక్కింది. ఎంతలా అంటే..? క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన దశాబ్దపు టెస్టు జట్టులో కోహ్లీకి చోటివ్వడమే కాకుండా ఏకంగా కెప్టెన్సీ బాధ్యతల్ని కూడా అప్పగించింది. అలానే వన్డే, టెస్టు, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా 2019లో విరాట్ కోహ్లీ తన మార్క్ చూపాడు.

 

View this post on Instagram

 

Happy new year from us to each and every one of you. God bless you all. 🙏❤️😇

A post shared by Virat Kohli (@virat.kohli) on
Please Read Disclaimer