రౌడీ-పూరి మధ్యలో ఇంద్రగంటి

0

యంగ్ హీరో విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. వరుసగా కొత్త సినిమాలకు సంతకం చేస్తూ వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. అదే సమయంలో ఎంచుకునే కథలు.. దర్శకుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. నోటా- డియర్ కామ్రేడ్ ప్లాప్ లుగా నిలవడంతో ఆ మేరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ పూర్తిచేసిన వెంటనే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సెట్స్ లో జాయిన్ అవుతాడని భావిస్తున్నారంతా. అయితే ఇంతలోనే ఓ ట్విస్టు తెరపైకి రావడం రౌడీ ఫ్యాన్స్ లో వేడెక్కిస్తోంది.

రౌడీ ఖాతాలో పూరి మాత్రమే కాదు.. పలువురు నవతరం దర్శకులు ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంద్రగంటితో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడని ఆయన సన్నహిత వర్గాలు లీకులందించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలే ఇంద్రగంటి వినిపించిన కథకు విజయ్ ఒకే చెప్పేశాడట. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ పూర్తయిన వెంటనే విజయ్ ఇంద్రగంటి సినిమానే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని వినిపిస్తోంది. వాస్తవానికి విజయ్ కోసం పూరి ఎంతో ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి సిద్దంగా ఉన్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ పూర్తవ్వగానే మెరుపు వేగంతో తన సినిమా పూర్తిచేయాలని పూరి చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో మధ్యలో ఇంద్రగంటి- దిల్ రాజు కాంబో విజయ్ ని లాక్ చేసే ప్లాన్ లో ఉన్నారట. మరి విజయ్ ముందుగా ఆ ఇద్దరి లో ఎవరికి ఛాన్స్ ఇస్తాడు అన్న సందిగ్ధతపై ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయ్.
Please Read Disclaimer