నాన్ బాహుబలి కేటగిరీలో `ఇండస్ట్రీ హిట్`

0

2020 లో సంచలన విజయం సాధించిన అల వైకుంఠపురములో.. తొలి వార్షికోత్సవ వేడుక ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈవెంట్లో బన్ని.. త్రివిక్రమ్ సహా పలువురు ఎమోషనల్ స్పీచ్ లతో కట్టిపడేసారు. తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ `AA ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్ పోస్టర్` ని అధికారిక ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ పోస్టర్ ఎంతో స్టైలిష్ గా ఆకట్టుకుంది. స్టైలిష్ స్టార్ వైట్ అండ్ బ్లాక్ ఫార్మల్ పై రెడ్ సూట్ ధరించి అల.. కార్పొరెట్ ఆఫీస్ లో చేసే హంగామాను ఈ పోస్టర్ మరోసారి గుర్తు చేసింది.

“అల వైకుంఠపురములో` చిత్రాన్ని మరిచిపోలేనంత బిగ్గెస్ట్ హిట్ చేసినందుకు థాంక్స్ అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ హిట్ చిత్రానికి ఏడాది అయ్యింది! అంటూ ప్రత్యేకించి నొక్కి చెప్పారు పోస్టర్ లో. బన్ని నటిస్తున్న తాజా చిత్రం పుష్ప కూడా ఇలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందేమో చూడాలి. ఆ తర్వాత మరో ఏడాదికి ఇలాంటి పోస్టర్ దర్శనమిస్తే చూడాలన్నది బన్ని-సుక్కూ అభిమానుల ఆకాంక్ష.