మిలియన్స్ తాతలకు స్ఫూర్తి

0

నాయనమ్మలు తాతయ్యలు మనవల్ని ముని మనవల్ని దగ్గర కూచోబెట్టుకుని కథలు వినిపించేవారు. జోల పాట పాడుతూనే జోకొడుతూనే బోలెడంత విజ్ఞానం అందించేవారు. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రభావంతో అలాంటి ఫెసిలిటీ లేనేలేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతమవుతుండడంతో అలాంటి ఛాన్స్ దొరకడం లేదు. అయితే ఆధునిక పోకడలకు దూరంగా కొన్ని సెలబ్రిటీ కుటుంబాలు ఇప్పటికీ మంచి కల్చర్ ని అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి వీకెండ్ లో కుటుంబ సభ్యులంతా ఒక చోట కూచుని ఆహ్లాదంగా కలిసి భోజనం చేయడం కబుర్లు చెప్పుకోవడం లాంటి గొప్ప కల్చర్ ని నెలకొల్పుతూ ఇంకా విలువల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఆదర్శాల గురించి చెప్పాల్సిన పనేలేదు. మెగా వృక్షం నీడలో ఎందరో హీరోలు ఎదగడమే కాదు.. మంచి కల్చర్ కూడా ఎదుగుతోందని ఇంతకుముందు పలు వేడుకలు అభిమానులకు అర్థమయ్యేలా చెప్పాయి. మొన్న దీపావళి దసరా వేడుకల్ని మెగా ఫ్యామిలీ ఎంతో సంబరంగా జరుపుకుంది. ఇంటిల్లిపాదీ ఈ వేడుకల్లో పాల్గొని గొప్ప కల్చర్ ని ఎలివేట్ చేశారు.

ఇక ఇంట్లో చిన్న పిల్లలతో కలిసి మెగాస్టార్ స్వయంగా ఈ సెలబ్రేషన్స్ దగ్గరుండి జరిపించారు. ఇక మనవలు మనవరాళ్లతోనూ చిరు టపాసులు కాకరపువ్వొత్తులు కాల్పిస్తూ ఎంతో సందడి చేశారు. పిల్లలతో ఎప్పుడూ ఆయన సన్నిహితంగా ఉంటారు. వారికి వీలున్నప్పుడల్లా రకరకాల విషయాలపై ఇదిగో ఇలా విజ్ఞానాన్ని అందిస్తుంటారు. ఈ వీడియోలో తన క్యూట్ మనవరాలికి `చూడాలనుంది` సినిమా స్టోరీని ఆయన మనవరాలికి చెబుతున్న తీరు ఆకట్టుకుంది. చూడాలనుంది చిరు కెరీర్ బ్లాక్ బస్టర్ అన్న సంగతి తెలిసిందే. ఆ కథ ఎలా పుట్టిందో చెబుతున్నారన్నమాట. ప్రస్తుతం ఈ వీడియో మోగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఖైదీనంబర్ 150- సైరా నరసింహారెడ్డి చిత్రాల తర్వాత చిరు తన కెరీర్ 152వ సినిమా కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Please Read Disclaimer